English | Telugu

Illu illalu pillalu: సినిమాకి వెళ్ళిన రామరాజ, వేదవతి.. చందుని శ్రీవల్లి డైవర్ట్ చేసిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-341 లో... ప్రేమ, నర్మద తనని ముసలివాళ్ళు అన్నారని వేదవతి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్లి ఏవండి మనం సినిమాకి వెళదామని అంటుంది. దానికి రామరాజు ఒప్పుకుంటాడు. చూసావా అక్క అత్తయ్య సినిమాకి అనగానే ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందోనని నర్మదతో ప్రేమ అంటుంది.‌

ఆ తర్వాత రామరాజు సినిమాకి వెళ్ళడానికి రెడీ అయి వస్తాడు. వేదవతి అద్దాలు పెట్టుకొని వస్తుంది. అది చూసి తిరుపతి షాక్ అవుతాడు. సినిమాకి ఇలాగే వెళ్లాలండి అని రామరాజుతో వేదవతి చెప్తుంది.

మరొకవైపు శ్రీవల్లి టెన్షన్ పడుతూ గేట్ దగ్గర ఉంటుంది. అది చూసి ఏదో చేస్తుంది.. అది ఏంటో తెలుసుకోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. చందు రాగానే తనని గేట్ దగ్గర ఆపుతుంది. నేను నాన్నతో మాట్లాడాలని చందు కోపంగా వెళ్తాడు. చందు లోపలికి వెళ్లి నాన్న మీకు ఒక విషయం చెప్పాలి.. అది మన పరువుకి సంబంధించినదని అమూల్య గురించి చెప్పబోతుంటే శ్రీవల్లి పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అది చూసి చందు వాళ్ళు వచ్చి తనని గదిలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత రామరాజు, వేదవతి సినిమాకి వెళ్తారు.

అదంతా శ్రీవల్లి కావాలని చేస్తుందని ప్రేమ, నర్మదలకి అర్థం అవుతుంది. అసలు ఏమైంది బావ ఎందుకు అలా కోపంగా ఉన్నావ్.. నీకు సంబంధించినవి నాకూ చెప్పకూడదా అని శ్రీవల్లి అంటుంది. దాంతో అమూల్య, విశ్వ పార్క్ లో కన్పించిన విషయం శ్రీవల్లికి చెప్తాడు. మీరు ఆ విషయం మావయ్యకి‌ చెప్తే ఇంట్లో పరువు పోతుందని అమూల్య ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని శ్రీవల్లి అనగానే చందు కూడా ఆలోచనలో పడతాడు. హమ్మయ్య అని శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లి దగ్గరికి ప్రేమ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.