English | Telugu
Jayam serial : పెద్దసారు ఇంటికి వెళ్లిన గంగ.. తనని రుద్రా అంగీకరిస్తాడా!
Updated : Jul 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో......గంగ బియ్యం బస్తాలు మోస్తుంటే రుద్ర వాళ్ళ పెద్దనాన్న చూస్తాడు. మీరు ఇక్కడ ఏంటి పెద్దసారు అని గంగ అడుగుతుంది. అయిన నువ్వు బస్తాలు మోయడం ఏంటని అతను అడుగుతాడు. మా నాన్న అప్పు తీర్చడానికి అని జరిగిందంతా గంగ చెప్తుంది. అలాంటప్పుడు నన్ను అడగాలి కదా అని పెద్దసారు అంటాడు. నేను పని చేసే రుద్ర సర్ దగ్గరికి వెళ్లి అడ్వాన్స్ అడిగాను ఇవ్వలేదని గంగ చెప్తుంది.
ఆ డబ్బు నేను ఇస్తాను కానీ నువ్వు మాత్రం ఇక ఇవి మోయకు అని అంటాడు. మరొకవైపు పైడి రాజుకి అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో సామాను అంతా తీసుకొని వెళ్తుంటారు. ఈ సామాను అమ్మితే మీ అప్పు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మీరు తీసుకోగ మిగిలిన డబ్బు నాకు ఇవ్వండి అని పైడిరాజు అంటాడు . ఆ తర్వాత గంగ పెద్దసారుతో కలిసి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి సామాను అంత కింద పడేసి ఉంటుంది. అది చూసి ఏమైందని వాళ్ళ అమ్మని అడుగుతుంది. గంగ వాళ్ళ అమ్మ జరిగింది మొత్తం చెప్తుంది. గంగ చేతులు బొబ్బలు వస్తాయి. ఏమైందని వాళ్ళ అమ్మ అడుగగా బియ్యం బస్తాలు మోసిందని పెద్దసారు చెప్తాడు. ఇక నువు మా కోసం కష్టపడకు నీ దారి నువ్వు చూసుకోమని వాళ్ళ అమ్మ అంటుంది. గంగని మా ఇంటికి తీసుకొని వెళ్తానని పెద్దసారు అనగానే వాళ్ళ అమ్మ సరే అంటుంది. రుద్ర సారు ఒప్పుకోరని గంగ అనగానే నేను ఒక్కరోజులో అన్ని సర్దుబాటు చేస్తానని పెద్దసారు చెప్తాడు. మరుసటి రోజు నేను సూపర్ మార్కెట్ లో పని చేస్తూనే పెద్దసారు వాళ్ళ ఇంట్లో ఉంటానని గంగ తనతో వర్క్ చేసే వాళ్ళకి చెప్తుంది.
అప్పుడే రుద్ర వచ్చి.. ఏంటి ఈ మీటింగ్, మాట్లాడితే జీతం కట్ చేస్తానని గంగకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే పెద్దసారు సూపర్ మార్కెట్ కి వస్తాడు. తరువాయి భాగం లో పెద్దసారు గంగని తీసుకొని ఇంటికి వెళ్తాడు. గంగ సూపర్ మార్కెట్ లో ఉండడం ఇష్టం లేదు.. అలాంటిది ఇంట్లో ఉంటే రుద్ర ఎలా ఒప్పుకుంటాడని ఇంట్లో వాళ్ళు అంటారు. అప్పుడే రుద్ర ఇంట్లోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.