English | Telugu
Jayam serial : గంగ, రుద్రల శోభనానికి ముహుర్తం పెట్టించిన పెద్దసారు!
Updated : Nov 26, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -124 లో.....పారుని శకుంతల లోపలికి తీసుకొని వస్తుంది. గంగ ఈ ఇంటి కోడలు అని నేను అనుకోవడం లేదు.. ఒక్క మావయ్య గారు మాత్రమే అనుకుంటున్నాడు.. రుద్ర అయితే దూరం దూరం ఉంటున్నాడని శకుంతల అంటుంది. ఇదంతా చూస్తుంటే తలనొప్పిగా ఉందని శకుంతల అనడం గంగ వింటుంది. అమ్మ గారికి తలనొప్పిగా ఉందట కాఫీ చేసి తీసుకొని వస్తానని కిచెన్ లోకి వెళ్లి పాలు వేడి చేస్తుంది. అప్పుడే ఇషిక వచ్చి అత్తయ్య పర్మిషన్ లేకుండా కిచెన్ లోకి ఎందుకు వచ్చావని గంగపై కోప్పడతుంది.
అదే విషయం ఇషిక వెళ్లి శకుంతలకి చెప్తుంది. దాంతో శకుంతల వస్తుంది. ఎందుకు కిచెన్ లోకి అడుగుపెట్టావని గంగపై శకుంతల కోప్పడుతుంది. ఇక అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా గంగ ఈ ఇంటికి కోడలు అని పెద్దసారు అంటాడు. అప్పుడే స్టవ్ పై పాలు పొంగిపోతాయి. ఎలాగైతే ఏంటి కొత్త కోడలు చేత పాలు పొంగించావని పెద్దసారు అనగానే శకుంతల కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గంగ కాఫీ తీసుకొని రుద్ర దగ్గరికి వెళ్తుంది. మీరు కొంచెం తాగి నాకు కొంచెం ఇవ్వండి అని గంగ అంటుంది. నాకు అలా ఇష్టం ఉండదని రుద్ర అంటాడు. అయిన సరే గంగ వినిపించుకోకుండా లాక్కుంటుంది. ఈ పనులు పక్కన పెట్టి బాక్సింగ్ పై ఇంట్రెస్ట్ పెట్టు అని రుద్ర అంటాడు. నేను ఈ ఇంటికి కోడలిని అన్ని పనులు చెయ్యాలని గంగ అంటుంది. అయితే నా బట్టలు ఇస్త్రీ చెయ్.. కరెంటు షాక్ అయ్యేలా కాకుండా.. డ్రెస్ కాలిపోకుండా చెయ్ అని రుద్ర చెప్తాడు.
దాంతో గంగ మంట పెట్టి చెంబుతో ఇస్త్రీ చెయ్యాలని ట్రై చేస్తుంది. ఇంట్లో వాళ్లంతా వింతగా చూస్తారు. ఇంటిపని మనిషి కూడా ఇంత చీఫ్ గా ఆలోచించదని శకుంతలతో పారు అంటుంది. ఇషిక, పారు శకుంతల, వీరు మాట్లాడుకుంటారు మేమ్ ముగ్గురం నీకు సపోర్ట్ ఉన్నాం.. రుద్ర బావని నీ ప్రేమతో నీ వైపుకి తిప్పుకోమని పారుతో ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, స్నేహ ముగ్గురు మాట్లాడుకుంటారు. గంగ ఎక్కడ ఉంటే అక్కడ సరదా ఉంటుంది. అన్నయ్యకి కరెక్ట్ జోడి అని నవ్వుకుంటారు. అప్పుడే రుద్ర వచ్చి.. మీరు ఆ తింగరి గంగకి ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో చెప్పొచ్చు కదా అని అంటాడు. వద్దు అన్నయ్య తనలా తనని ఉండనివ్వండి అని ప్రీతీ అంటుంది. తరువాయి భాగంలో గంగ, రుద్ర శోభనానికి పెద్దసారు ముహూర్తం పెట్టిస్తాడు. శకుంతల షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.