English | Telugu

Jayam serial : గంగని పెళ్ళి చేసుకున్న రుద్ర.. బాక్సింగ్ పోటీకి వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -116 లో.... గంగని బాక్సింగ్ పోటీకి తీసుకొని వెళ్ళడానికి రుద్ర పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. గంగ మెడలో మణి తాళి కట్టబోతుంటే.. రుద్ర అడ్డుపడుతాడు. గంగకి ఈ బాక్సింగ్ చాలా ముఖ్యం తనని తీసుకొని వెళ్లనివ్వండి అని రుద్ర వాళ్ళ పేరెంట్స్ తో చెప్తాడు.

వద్దు నా కూతురి తీసుకొని వెళ్లాడానికి నువ్వు ఎవరు? నీకేం అధికారం ఉందని రుద్రని పైడిరాజు అడుగుతాడు. నీ వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని అంటాడు. ఇప్పుడు రెండోసారి పెళ్లి ఆగిపోతే నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని రుద్రతో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రుద్ర ఇంకా పెళ్లి పీటలపైకి రాలేదని శకుంతల ఆడుగుతుంది. వస్తున్నాడు అయిదు నిమిషాలు అని ప్రీతి చెప్తుంది. రుద్రకి శకుంతల ఫోన్ చేస్తుంది.. పక్కనే ఉన్న ప్రీతి దగ్గర ఫోన్ ఉంటుంది. రుద్ర ఫోన్ నీ దగ్గర ఉందేంటని శకుంతల అడుగుతుంది. ఇందాక నువ్వు చేసావ్ కదా నేనే లిఫ్ట్ చేశాను కదా నా దగ్గర ఉందని ప్రీతి కవర్ చేస్తుంది. నాకేదో డౌట్ గా ఉందని పారు వాళ్ళ అన్న హరికి డౌట్ వస్తుంది వెంటనే రుద్ర గదిలోకి వెళ్లి చూస్తాడు. అక్కడ రుద్ర ఉండడు.

దాంతో హరి అందరికి వచ్చి రుద్ర లేడని చెప్తాడు. అందరు షాక్ అవుతారు. మరొకవైపు పైడిరాజు, లక్ష్మీ మాటలు రుద్ర వింటాడు. గంగ మెడలో రౌడీ తాళి కట్టబోతుంటే రుద్ర వచ్చి ఆపి గంగ మెడలో రుద్ర తాళి కడుతాడు. ఏం అధికారంతో తీసుకుపోతున్నావని అడిగావ్ కదా గంగ ఇప్పుడు నా భార్య అని రుద్ర అంటాడు. లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నేను పోటీకి వెళ్తున్నాను నన్ను ఆశీర్వాదించమని లక్ష్మీ దగ్గర గంగ ఆశీర్వాదం తీసుకుంటుంది. గంగ చెయ్ పట్టుకొని రుద్ర తన వెంట తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.