English | Telugu

లాస్ట్ ఏడిచింది అప్పుడే...

బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షోస్ లో ఎక్కువగా జబర్దస్త్ షో సూపర్ ఫేమస్ అయింది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమై వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. అందులో రౌడీ రోహిణి, పటాస్ ఫైమా కూడా ఉన్నారు. ఫైమా నెమ్మదిగా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతూ వస్తోంది. అలాంటి ఫైమా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్ గా "ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే అడగండి" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేసరికి "నువ్వు ఫైనల్ గా ఎప్పుడు ఏడ్చావ్" అని అడిగారొక నెటిజన్ "అక్టోబర్ 25 న" అని చెప్పింది. "అబ్రాడ్ వెళ్ళావ్ కదా అక్క..ఎలా ఉంది" అనేసరికి " చాలాబాగుంది కానీ ఫుడ్ బాలేదు" అన్నట్టు చెప్పింది. "మీ హౌస్ కి మొత్తం ఎంత ఖర్చు అయింది" అని అడిగేసరికి "14 లక్షలు పెట్టి కొన్నాను. 15 లక్షలు పెట్టి మోడిఫై చేయించాను" అని చెప్పింది.

"అక్టోబర్ 25 న ఎందుకు ఏడ్చావ్ అక్కా" అని ఇంకో నెటిజన్ అడిగేసరికి "నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది" అని చెప్పింది. ఫైమా పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత జబర్దస్త్ లో మెరిసి మురిపిస్తోంది. జబర్దస్త్ లో చేసే సమయంలోనే ప్రవీణ్ కి, ఫైమాకి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఇక వీరి మధ్య ఉన్న రిలేషన్ చూసిన ప్రతి ఒక్కరు వీరు లవర్స్ అని అనుకునేవాళ్లు. కానీ తర్వాత ఫైమా బిగ్ బాస్ కి వెళ్లిపోవడంతో వాళ్ళ రిలేషన్ కి అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఐతే పటాస్ ప్రవీణ్ తన ప్రేమను ఫైమాకు చెప్పాడు కానీ ఫైమా మాత్రం రిజెక్ట్ చేసి ఎప్పటికీ ఫ్రెండ్స్ లా ఉందాం అని చెప్పింది ఫైమా. ఐతే ఫైమా ప్రవీణ్ లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఆ ఓ కమెడియన్ అనే రూమర్ కూడా ఉంది.