English | Telugu

నాగుల చవితి కోసం ఆన్‌లైన్‌లో రక్తపింజరి ఆర్డర్...ఎంత ఆర్గానిక్ హృదయమో


జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాఘవ స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రాఘవ అలాగే లేడీ గెటప్ మోహన్ కలిసి ఈ స్కిట్ వేశారు. ఐతే లేడీ గెటప్ మోహన్ ఆన్లైన్ లో ఒక పామును బుక్ చేసాడు. ఆ ఆర్డర్ ఇంటికి వచ్చింది. ఇక రాఘవ మాములుగా ఆ ప్యాక్ తీసుకుని "ఎం బుక్ చేసావే" అని అడిగాడు రాఘవ. "పాము బుక్ చేశా. ఆరు నెలల్లో నాగుల చవితి వస్తోంది కదా పాలు పోయాలని పామును బుక్ చేశా" అని చెప్పింది. దాంతో రాఘవ షాకయ్యాడు. "ఇంతకు ఎం పాము బుక్ చేసావ్ " అన్నాడు రాఘవ. "మన పక్కింటి రష్మీ కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్సట్రా ఉండాలని చెప్పి రక్త పింజరిని బుక్ చేశా." అనేసరికి ఇంట్లోకి వెళ్లి ఆ పామును తెచ్చిన ప్యాకింగ్ ని చూసి ఏంటి మూత తెరిచి ఉంది అని కంగారు పడ్డాడు. "గాలి ఆడాలని మూత ఓపెన్ చేసి పెట్టా" అని మోహన్ చెప్పాడు. దాంతో రాఘవ అదిరిపడ్డాడు. "ఎక్కడుందో అది" అని కంగారు పడ్డాడు రాఘవా.

ఇక మోహన్ ఐతే అదేదో పెంపుడు పాము ఐనట్టు "రక్తమ్మా..రక్తమ్మా.." అని పిలిచేసరికి రాఘవకు కోపం తన్నుకొచ్చింది. "ఏ కన్నంలో ఉందో వెతుకు" అన్నాడు రాఘవ. ఇంతలో మరో ఆర్డర్ డెలివరీ వచ్చేసరికి "ఎం ఆర్డర్ తెచ్చావ్" అన్నాడు రాఘవ. "బర్రెను బుక్ చేశారండి" అన్నాడు డెలివరీ బాయ్. "ఈమె బర్రెను బుక్ చేశావా" అన్నాడు కోపంగా. "పాముకు పాలు పోయాలి కదా..పాముకు ప్యాకెట్ పాలు పడతాయో లేదో అని బర్రెను బుక్ చేశా" అని చెప్పింది. దాంతో రాఘవ "నీ ఆర్గానిక్ హృదయానికి దణ్ణమె బాబు" అన్నాడు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.