English | Telugu

Illu illalu pillalu : కొడుకు, కోడలి శోభనానికి ఏర్పాట్లు చేసిన రామరాజు.. టెన్షన్ లో వేదవతి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -179 లో... నర్మద తన శోభనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు జరిగిందని వేదవతితో చెప్పగానే వేదవతి షాక్ అవుతుంది. అదంతా శ్రీవల్లి విని.. అమ్మ చెప్పినట్టు నా కంటే ముందు నర్మద ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో వాళ్ళందరు తననే నెత్తిన పెట్టుకుంటారు. అలా జరగకూడదని శ్రీవల్లి అనుకుంటుంది. తల నొప్పిగా ఉంది అత్తయ్య అని నర్మద అంటుంటే.. దీనికి ఏం తక్కువ లేదంటూ వేదవతి తన వొళ్ళో నర్మదని పడుకోబెట్టుకొని మసాజ్ చేస్తుంది. అదంతా శ్రీవల్లి చూసి కుళ్ళుకుంటుంది.

ఆ తర్వాత ప్రేమ బస్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే ధీరజ్ సైకిల్ పై వస్తాడు. ధీరజ్ సైకిల్ పై రావడం ప్రేమ ఫ్రెండ్స్ చూసి ఎగతాళిగా మాట్లాడుతుంటే ప్రేమ వాళ్లపై కోప్పడుతుంది. ఆ తర్వాత ధీరజ్ కి ఎదురుగా వెళ్లి లిఫ్ట్ అడుగుతుంది. ఇది సైకిల్ అని ధీరజ్ అంటాడు. అంటే నీకు డబుల్స్ తో సైకిల్ తొక్కడం రాదా అని ప్రేమ అనగానే.. వచ్చు అని తనని సైకిల్ పై ఎక్కించుకుంటాడు ధీరజ్. దాంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత రాత్రి ఇంట్లో అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు‌. మీనాక్షి సరుకుల కోసం ఇంటికి వస్తుంది. అప్పుడే రామరాజు వచ్చి పంతులిని రమ్మని చెప్పాను. రేపు సాగర్ , నర్మదలకి శోభనం అని రామరాజు అనగానే వేదవతి టెన్షన్ పడుతుంది. నర్మద మాత్రం.. ఏం అవుతుంది అత్తయ్యకు మాత్రమే మాకు శోభనం జరిగిందని తెలుసు కదా అని అనుకుంటుంది. అప్పుడే రామరాజు మాటలు విని శ్రీవల్లి నవ్వుతుంది.

తరువాయి భాగంలో ధీరజ్ వచ్చేసరికి ప్రేమ క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. ధీరజ్ వచ్చి.. నువ్వు పది మందికి డ్యాన్స్ నేర్పి బ్రతకొచ్చని అనగానే మంచి ఐడియా ఇచ్చాడని ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.