English | Telugu

అష్షుకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో..ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్

అష్షు రెడ్డి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మంచి హాట్ బ్యూటీ అంతేకాదు ఆర్జీవీ హీరోయిన్ కూడా.. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోయడంలో బేబీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని.. సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే హీరోయన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. "ఏ మాస్టర్ పీస్‌" మూవీతో అరవింద్‌ కృష్ణతో కలిసి నటించింది. అలాంటి అష్షుకి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆ కష్టం పేరే "ఫేస్ ఐడీ". చాలా మంది ఈమధ్య కాలంలో ఫేస్ ఐడీని యూజ్ చేస్తూ ఆండ్రాయిడ్ ని అన్లాక్ చేస్తున్నారు. దాంతో సెల్ పాస్ వర్డ్స్ ని కూడా మర్చిపోతున్నారు.

ఇప్పుడు అష్షుకి కూడా అదే ప్రాబ్లమ్ వచ్చింది. "రెగ్యులర్ గా ఫేస్ ఐడీ మాత్రమే యూజ్ చేస్తుండేసరికి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో నేను నా పాస్వర్డ్ ని మర్చిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు..."అని చాలా ఫీలైపోతోంది. అంతలోనే పెద్ద జ్ఞానోదయం ఐనట్టు మరో మెసేజ్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఇలా ఫేస్ ఐడీ మీద డిపెండ్ అవడం అంటే చాలా కష్టం..అది చాలా ఫ్రస్ట్రేషన్ కి గురి చేస్తూ ఉంటుంది. అన్ని నంబర్స్ ని చెరిపేసి ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. ప్లీజ్ అందరూ దయచేసి నాకు ప్రైవసీ కావాలన్న విషయాన్ని అర్ధం చేసుకోండి" అంటూ తన బాధ మొత్తాన్ని పోస్ట్ చేసింది అష్షు రెడ్డి. మరి మీరెవరూ అష్షుని డిస్టర్బ్ చేయొద్దు. ఇక అష్షు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్ కూడా..ఆయన పేరును తన బాడీ మీద టాటూగా వేయించుకుని మరీ తన ఫాన్స్ కి చూపించింది. ఇక అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ చూస్తే మాత్రం ఆ రచ్చ వేరే లెవెల్ లో ఉంటుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.