English | Telugu

గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్.. ఉల్టా పల్టా జరుగనుందా?

బిగ్ బాస్ ట్విస్ట్ లకి రోజు రోజుకి మైండ్ బ్లాక్ అవుతుంది. ‌ఉల్టా పల్టా థీమ్ తో హౌస్ మేట్స్ కే కాదు ప్రేక్షకులకి క్రేజీ కిక్కుని ఇస్తున్నాడు.

ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ వారం మొత్తం జరిగిన టాస్క్ లలో ఎవరు ఎలా ఆడారో? ఎవరేం తప్పులు చేశారో క్లాస్ పీకుతాడేమో అని టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ వారం కూడా ఫీమేల్ హౌస్ మేట్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్లో ఉన్నవారిలో లీస్ట్ లో పూజా మూర్తి ఉంది. ఆ పైన గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఉన్నాడు. అందుకేనేమో బిగ్ బాస్ కేక్ తో పాటు తేజకి వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ వారం ఎలిమినేషన్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఓటింగ్ లో టాప్ వన్ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. ఇక మెరుగైన ఆటతీరుతో అశ్విని మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మ్యూజిక్ లవర్స్ భోలే షావలికి ఓట్లు గట్టిగానే వేసునట్టు తెలుస్తుంది. ఇంకా శోభా శెట్టి, ప్రియాంక చేసిన ఆర్గుమెంట్ లో భోలే షావలికి సింపథీ బాగానే వర్కవుట్ అయినట్టు తెలుస్తుంది. అతను నాల్గవ స్థానంలో ఉన్నాడు.

ఇప్పటికి వరుసగా ఆరు వారాల నుండి ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవ్వడం, ఈ వారం కూడా మరో ఫీమేల్ అవుతుందా లేక ఉల్టా పల్టా చేసి గౌతమ్ లేదా తేజలో ఎవరినైనా బయటకి పంపించేస్తాడా చూడాలి మరి. ఇప్పటికి నమోదైన అనఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతని మాటతీరు, మెచురిటీ లేకుండా మాట్లాడే విధానం ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారనే చెప్పాలి. అయితే ఈ వారం దసరా వీక్ అవ్వడంతో మరింత వినోదాన్ని అందించడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..