English | Telugu
వరెస్ట్ పర్ఫామర్ గా ఇనయా!
Updated : Nov 12, 2022
బిగ్ బాస్ హౌస్ లో ప్రతీవారం వరెస్ట్ పర్ఫామర్ ని ఎన్నుకొని జైలు లో వేయడం అనేది అందరికి తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఇది ఆసక్తిని రేపుతోంది. కారణం ఇనయా. తన మాస్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోతున్న ఇనయాకి వరెస్ట్ పర్ఫామర్ ఇవ్వడం అనేది ఇంట్రెస్ట్ గా మారింది.
"ఈ వారం హౌస్ లో వరెస్ట్ పర్ఫామర్ ఎవరో? అందరూ కలిసి చెప్పండి" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ ని అడిగాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా వచ్చి వారికి ఎవరు వరెస్ట్ అనిపించారో, ఎవరి పర్ఫామెన్స్ తక్కువగా ఉందో చెప్తూ ఒక్కొక్కరికి వరెస్ట్ అని స్టాంప్ వేసారు. అలా ఇంటి సభ్యులు, వరెస్ట్ పర్ఫామర్ ఎవరు? ఎవరిని జైలుకి పంపించాలనుకుంటున్నారో అని చర్చించుకున్నారు. అలా అందరు ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. రాజ్, శ్రీసత్యకి వరెస్ట్ పర్ఫామర్ ఇచ్చాడు. మెరీనా, కీర్తి భట్ ని వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకుంది. శ్రీసత్య, రేవంత్ ని వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకోగా, రేవంత్, శ్రీసత్యని వరెస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. అయితే శ్రీహాన్ ఇనయాకి వరెస్ట్ పర్ఫామర్ ఇచ్చాడు. ఆదిరెడ్డి, వసంతి కూడా ఇనయాకే వరెస్ట్ పర్ఫామర్ ఇవ్వడంతో, ఎక్కువ హౌస్ మేట్స్ ఇనయాని వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకున్నట్టుగా డిక్లేర్ అయ్యింది.
ఆ తర్వాత కెప్టెన్ గా ఉన్న ఫైమాని, "ఈ వారం వరెస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పండి" అని బిగ్ బాస్ అడిగాడు. దానికి ఫైమా, "ఎక్కువ మెజారిటీ ఇనయాకి రావడంతో ఇనయా ఈ వీక్ వరెస్ట్ పర్ఫామర్ బిగ్ బాస్" అని చెప్పింది. ఆ తర్వాత ఫైమా, ఇనయాని జైలులో పెట్టి తాళం వేసింది. కాసేపటికి జైలు దగ్గర మెరీనా, వసంతి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాగా ఈ వారం నామినేషన్ లో ఉన్న ఇనయా సేఫ్ జోన్ లో ఉంది.