English | Telugu
రష్మీకి రోజ్ ఇచ్చి.. గెహెనాతో స్టెప్పేసి.. వర్షను పెళ్లి చేసుకుంటానన్న 'గాలోడు'!
Updated : Nov 12, 2022
రాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ రోజునే 'గాలోడు'మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సుధీర్ మాత్రమే కనిపించాడు. అలా ఈ మూవీని ప్రమోట్ చేసుకున్నాడు. ఇక దీనికి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇక ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వేరే స్కిట్స్ ఏవీ కనిపించలేదు. ఓన్లీ సుడిగాలి సుధీర్ మాత్రమే కనిపించాడు. 'డీజే టిల్లు' సాంగ్ తో సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. రాంప్రసాద్ డైరెక్టర్ గా, సుధీర్ హీరోగా ఒక స్కిట్ పెర్ఫార్మ్ చేశారు. "చాలా మంది హీరోస్ కి నేను ఫ్లాప్స్ ఇచ్చాను, నీకు కూడా మంచి ఫ్లాప్ ఒకటి ఇస్తాను" అని పంచ్ వేశాడు రాంప్రసాద్.
ఇక స్కిట్ లో భాగంగా మూవీ సీన్ ఒకటి చేసాడు సుధీర్. రష్మీకి రోజ్ ఇచ్చి "నేను చచ్చిపోతే నువ్వేడుస్తావో లేదో తెలీదు కానీ నువ్ ఏడిస్తే నేను చచ్చిపోతాను" అనేసరికి, "చావరా చావు" అని తిట్టేసింది రష్మీ. ఇకసుధీర్ , గెహెనా సిప్పీ హీరో హీరోయిన్స్ గా నటించిన 'గాలోడు' మూవీ థియేటర్స్ లో 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి వచ్చింది.
సుధీర్, వర్ష, ఇమ్ము ముగ్గురు కలిసి చేసిన స్కిట్ లో "మన పెళ్లి అవుతుందా అసలు?" అని వర్ష, సుధీర్ ని అడిగేసరికి "గాలోడు రిలీజ్ అవగానే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పాడు.. "నాకు అర్థమయ్యిందిలే మన పెళ్లి అవదు" అనికౌంటర్ వేసింది వర్ష. ఇక ఫైనల్ గారష్మీతో ఒక రొమాంటిక్ సాంగ్ కి స్టెప్స్ వేసి అందరిని ఫిదా చేసేసాడు సుధీర్.