English | Telugu

పిచ్చి పడుతుంది అమ్మ: ఆదిరెడ్డి !


బిగ్ బాస్ డెభ్బై ఒకటవ రోజు 'సత్తే ఏ గొడవ లేదు' పాటతో మొదలైంది. ఆ తర్వాత ఆదిరెడ్డి ఒక్కడే కూర్చొని మాట్లాడుకున్నాడు. "సింబాలిక్ గా నేను కూడా వెళ్ళిపోతా అని చెబుతున్నారా బిగ్ బాస్" అని ఆదిరెడ్డి ఒంటరిగా చెప్పుకుంటు ఉన్నాడు. ఆ తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి.

"మీ దగ్గర ఉన్న అతిపెద్ద శక్తిని ఉపయోగించి, ఇంటి సభ్యుల నుండి ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నారో, ఎందుకు ఇంటిలో ఉండకూడదు. అని అనుకుంటున్నారో చెప్పండి. కెప్టెన్ అయినందున ఫైమా మీరు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించండి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఫైమా మొదటగా రోహిత్ ని నామినేట్ చేయగా, తర్వాత ఇనయాని నామినేట్ చేసింది. "గేమ్ గేమ్ లా ఆడట్లేదు. ఫిజికల్ గా ఆడకు. పర్సనల్ గా ఆడకు" అని ఇనయాతో, ఫైమా చెప్పింది. ఆ తర్వాత ఆదిరెడ్డి, శ్రీహాన్ ని నామినేట్ చేసాడు. సెకండ్ నామినేషన్ గా రోహిత్ ని నామినేట్ చేసాడు. "మన అగ్రెసివ్ ఓవర్ అయినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి" అని ఆదిరెడ్డి, రోహిత్ తో చెప్పాడు.

ఇనయా, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఇనయా కారణం చెబుతూ, "నువ్వు ఆ వారం మైక్ విసేరయకపోతే మన టీం గెలిచేది. అలా నువ్వు తప్పు చేసి, ఇప్పుడు రోహిత్ ని నామినేట్ చేసావ్ అది నాకు నచ్చలేదు" అని ఇనయా, ఆదిరెడ్డికి చెప్పింది. దీంతో ఆదిరెడ్డి మాట్లాడుతూ "పిచ్చి పడుతుంది అమ్మా..నీ రీజన్స్ కి..ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నామినేట్ చేయడం ఏంది అమ్మ" అని ఇనయాతో చెప్పాడు. ఇలా ఇనయాకి, ఆదిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ జరిగింది. అయితే చివరలో ఆదిరెడ్డి మాట్లాడుతూ "బిగ్ బాస్, నా తర్వాత వీక్ నామినేషన్ ఇనయా" అని చెప్పాడు. వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుందో? ఏమో? చూడాలి.