English | Telugu
ఆసక్తిగా మారిన ఈ వారం ఎలిమినేషన్!
Updated : Nov 15, 2022
ప్రేక్షకులు సోమవారం జరిగే నామినేషన్స్ ని ఇంట్రెస్ట్ గా చూస్తారు. కారణం కంటెస్టెంట్స్ చెప్పే సిల్లీ రీజన్స్, వీటికి వాళ్ళు వేసే నామినేషన్స్ కి అసలు సంబంధం ఉండదు. కానీ కంటెస్టెంట్స్ మధ్య జరిగే ఈ నామినేషన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. కాగా అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్ మీదే ఉంది.
గతవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే సోమవారం జరిగిన నామినేషన్స్ లో ఒక్కొక్కరు వచ్చి తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పారు. గతవారం నాగార్జున వచ్చినప్పుడు "నామినేషన్స్ లో అందరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి" అని చెప్పాడు. అది కంటెస్టెంట్స్ కి బాగానే గుర్తున్నట్టుంది. అందుకేనేమో ఒక్కో కంటెస్టెంట్ అవతలి కంటెస్టెంట్ గురించి పర్సనల్ గా మాట్లాడకుండా, ఏవైతే అవసరమో అవే చెప్పి నామినేట్ చేసారు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతు హౌస్ నుండి బయటకు వెళ్ళింది. ఆచితూచి మాట్లాడే ఆదిత్య బయటకొచ్చేసాడు. గ్లామర్ కి తప్ప మనుషులని పట్టించుకోని వసంతి కూడా బయటకు రావడంతో, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తర్వాత ఎవరు బయటకు వెళతారో అనే భయంతో ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ వారం హౌస్ ను వీడేది ఎవరో అని చూడాలి మరి.