English | Telugu
సోహెల్ వస్తే కథ వేరే ఉంటది!
Updated : Nov 26, 2022
బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు సోహెల్ పేరు సుపరిచితమే. ఎందుకంటే సీజన్ 4 లో ఒక ఆట ఆడుకున్నాడు. అంతలా ఉండేది ఆ ఆటతీరు. ఇది సీజన్ 6 అయినా కూడా అతని పేరుని ప్రేక్షకులు మరచిపోలేకపోతున్నారంటే, అట్లుంటది సోహెల్ తో మరి. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున బోలెడు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసాడు. ప్రతీ కంటెస్టెంట్ కి సంబంధించిన ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు.
కాగా అందులో ఇనయా తరుపున సోహెల్ వచ్చి, ఇనయా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్ని ఇప్పుడు వద్దు అని చెప్పినా వినకుండా నాగార్జునతో చెప్పేసాడు. సోహెల్ మట్లాడుతూ "ఇనయా ఒక జిమ్ లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఆ జిమ్ నుండి ఎందుకు మానేసిందో? అడగండి సర్" అని నాగార్జునతో చెప్పగా, ఇనయా ఆశ్చర్యంగా "ఇక చాలు సోహెల్ ఆపేయ్" అని అంది.
అసలు విషయం ఏంటి అంటే సోహెల్ బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుండి ఇనయాకి ఇష్టం ఉండడంతో సోహెల్ ఎక్కడ ఉంటాడో కనుక్కొని, తను ఉండే దగ్గరికి షిఫ్ట్ అయిందట. అలాగే అతను ఏ జిమ్ కి వెళ్తాడో కనుక్కొని, సరిగ్గా ఆ జిమ్ లోనే జాయిన్ అవ్వగా, అక్కడ సోహెల్ ఇద్దరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉండడం చూసి జలస్ గా ఫీల్ అయిందంట. అలా సోహెల్ తన మొదటి క్రష్ అని, తన నెంబర్ కూడా అడగుదామని అనుకున్నట్టు ఇనయా చెప్పుకొచ్చింది.