English | Telugu
గొడవల్లో కంటెస్టెంట్స్ ..!
Updated : Nov 3, 2022
'లాలా భీంలా' పాటతో బిగ్ బాస్ యాభై తొమ్మిదో రోజు సందడిగా మొదలైంది. మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో భాగంగా మొదటి మిషన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ మిషన్ పూర్తి అయ్యేసరికి చివరగా శ్రీహాన్, ఇనయా, ఫైమా ఉండగా శ్రీహాన్ ఇనయాని తోసేసి శ్రీహాన్ కూడా ఓడిపోయి, ఫైమాని గెలిపించాడు.
టాస్క్ ముగిసాక శ్రీహాన్, ఇనయా గొడవ పడ్డారు. "ఇనయా ఆగు, ఇందాక టాస్క్ లో నోరు జారావ్? ఏమన్నావ్? ఎందుకు అలా అన్నావ్. అది నోరా పెంటనా" అని శ్రీహాన్ అడిగాడు. "మీరు అక్కడ అలా పడుకోవడం నేను చూసా", అని అంది. దానికి పక్కనే ఉన్న శ్రీసత్య," హా చెప్పు. ఏం చేసామో చెప్పు" అని ఇనయాతో అంది. "మీరిద్దరు చాలా మాట్లాడారు" అని ఇనయా చెప్పింది శ్రీహాన్ తో. ఆ తర్వాత "ఒక కొశ్చన్ అడుగుతా చెప్పు, నువ్వు తన బెడ్ మీద పడుకున్నావ్ అని నేను చెప్పానా? అని ఇనయా అనగా, "బాగా కవర్ చేసావ్. డ్రామా క్వీన్ ఈజ్ హియర్. నోరంతా పెంట పెట్టుకుంది" అని శ్రీహాన్ అన్నాడు. దానికి రిప్లై గా, " మీ క్లారిటీ మీ దగ్గర పెట్టుకో" అని ఇనయా అంది.
గీతు ఏడుస్తు కూర్చోగా, 'ఏడ్వకు కళ్ళు తూడ్చుకో" అని ఆదిరెడ్డి అన్నాడు.
"బయట అలా ప్రవర్తిస్తు ఉంటా కానీ, నేను లోపల ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను" అని గీతు ఏడ్చేసింది.
"నేను దొంగ. ఎదవ. ఎదవన్నర ఎదవ" అని గీతు, ఆదిరెడ్డితో చెప్పింది. ఆ తర్వాత గీతుకి, ఇనయాకి వాగ్వాదం జరిగింది. అది అయ్యాక మళ్ళీ మరో గొడవ మొదలైంది. "బెడ్ మీద ముగ్గురు పడుకున్నారు అని ఇనయా అంది" అని శ్రీసత్య, గీతుతో చెప్పుకొచ్చింది. "నువ్వు తీసుకుంటావేమో కాని, నేను తీసుకోను. నా క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. కూర్చొని ముద్దులు పెట్టుకున్నొళ్ళు. అంతా బాగానే ఉన్నారు" అని శ్రీసత్య, గీతూతో చెప్పుకుంటు ఏడ్చింది.