English | Telugu
Illu illalu pillalu: ఆ విషయం గురించి ధీరజ్ ని అడగేసిన ప్రేమ!
Updated : Oct 25, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -298 లో.. తిరుపతి కూల్ డ్రింక్ లో మందు కలుపుతాడు. అది తాగి ప్రేమ మత్తులో ఉంటుంది. ఇక శ్రీవల్లిపై ఉన్న రివేంజ్ ని తీర్చుకుంటుంది. శ్రీవల్లిని ప్రేమ పిల్వగానే భయంతో తన దగ్గర కి వెళ్తుంది. ఏంటి చెల్లి అని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు మొన్న డాన్స్ చేసావ్ కదా.. ఇప్పుడు నేను చెప్పేది నవరసాల్లో చేసి చూపించమని చెప్తుంది.
దాంతో శ్రీవల్లి భయపడుతూ ప్రేమ చెప్పినట్లు చేస్తుంది. శ్రీవల్లి నీరసంతో ఇక నా వల్ల కాదు చెల్లి అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ధీరజ్ పడుకొని ఉంటాడు. ఎంత ముద్దుగా ఉన్నావ్ రా.. నువ్వు అంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు కానీ నువ్వు ఎప్పుడు అయితే నాకు సపోర్ట్ గా ఉన్నావో అప్పుడు బాగా నచ్చావని తన చెంపలని గిల్లుతుంది. ధీరజ్ లేచేసరికి పడుకొని ఉంటుంది. ఎవరు గిల్లారని చూసేసరికి ప్రేమ పడుకొని ఉంటుంది. మళ్ళీ ధీరజ్ పడుకుంటాడు. ప్రేమ లేచి మళ్ళీ అలాగే చేస్తుంటే.. దీరజ్ లేస్తాడు. ఒరేయ్ మొన్న నువ్వు నాకు పార్టీలో ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. దాంతో దీరజ్ బయటకు వెళ్తాడు.
ధీరజ్ వెనకాలే ప్రేమ వెళ్తుంది. డాన్స్ చేస్తూ పాట పాడుతూ తన వెనకాలే తిరుగుతుంది. వేదవతి, నర్మద బయటకు వస్తారు. ప్రేమ చూస్తుంద. చూసి మళ్ళీ లోపలికి వెళ్లి సాగర్ బయటకు రాకుండా నర్మద, రామరాజు బయటకు రాకుండా వేదవతి కవర్ చేస్తుంటారు. ముద్దు పెట్టావా లేదా అని ప్రేమ అడుగుతుంటే లేదని ధీరజ్ చెప్పడంతో ప్రేమ డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.