English | Telugu

'ఆదితో నా ఎంగేజ్మెంట్ అయ్యింది'.. శ్రద్ధా దాస్ కామెంట్స్ వైరల్!


'ఢీ - 14 ది డాన్సింగ్ ఐకాన్' షో ప్రతీ వారం దుమ్ము రేపుతోంది. ఈ వారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది కూడా కంటెస్టెంట్స్ కి సపోర్టింగ్ డాన్స్ కంటెస్టెంట్ గా చేశాడు. "వెయ్ రా చెయ్ వెయ్ రా" అనే సాంగ్ కి ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ తో పాటు ఆది వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఆ స్టెప్స్ చూసిన పూర్ణ "ఆది పొలంలో మొలకలొచ్చాయ్" అని గట్టిగా అరిచింది.

ఇక ఆర్నాల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి పూర్ణ ఆ కుర్రాడిని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులిచ్చింది. శ్రద్ధకి ఆది మీద కోపం వచ్చేసింది. పిల్లలంతా డాన్స్ చేస్తున్నారు. ఎన్ని సార్లు తాను అడుగుతున్నా ఆది చేయకపోయేసరికి కామెంట్ చేసింది శ్రద్ద. దాంతో పిచ్చి పిచ్చి స్టెప్పులేసి, పిల్లిమొగ్గలేసి పండుతో కలిసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు ఆది.

ఇదే టైంలో రిషిక, సాగర్ డాన్స్ చేస్తున్నప్పుడు"ఆదితో పాటు నా ఎంగేజ్మెంట్ అయ్యింది" అంటూ శ్రద్ధాదాస్ హాట్ కామెంట్స్ చేసింది. ఆ టీమ్ అంతా కలిసి ఆదిని శ్రద్ధ దగ్గరకు పూల జల్లు కురిపిస్తూ తీసుకెళ్లారు. అక్కడ ఆదికి శ్ర‌ద్ధ‌ రింగ్ పెడుతున్నట్టుగా చూపించారు.

ఇక ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి ఈ వారం మెగా ఎలిమినేషన్ రౌండ్ అని అనౌన్స్ చేసాడు. మరి ఈ వారం ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవాలంటే 19 వరకు వెయిట్ చేయాల్సిందే.