English | Telugu

అర్జున్ ని ఏడ్చేలా చేసిన వీడియో బైట్!

బిగ్ బాస్ లో మొదలైన 'బ్యాటరీస్ రీఛార్జ్' అనే ఈ సరికొత్త గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీని కనెక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్.

అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అర్జున్ వాళ్ళ నాన్న వీడియో బైట్ రిక్వెస్ట్ చేసాడు. కాసేపటి తర్వాత వీడియో బైట్ 'హౌస్ టీవి' లో రావడం మొదలైంది. హౌస్ మేట్స్ అందరూ చూస్తూ ఉండిపోయారు. అర్జున్ వాళ్ళ నాన్న వీడియోలో మాట్లాడుతూ, "హాయ్ అర్జున్. బాగున్నావా? నేను ఛాయ్ తాగేప్పుడు, టిఫిన్ చేసేప్పుడు మిస్ అవుతున్నా, ఏం పర్వాలేదు. నీ గేమ్ నువ్వు ఆడు. కోటిలో ఒకరికి వస్తుంది ఈ అదృష్టం. ఈ అవకాశం అందరికి రాదు. బాగా ఆడు" అని చెప్పుకొచ్చాడు. ఇది చూసి అర్జున్ కి కన్నీళ్ళు ఆగలేదు. ఒకే నాన్న ఆడుతాను అని ఏడుస్తూనే ఉన్నాడు. హౌస్ మేట్స్ అందరూ ఓదార్చినా అర్జున్ కి కన్నీళ్ళు ఆగలేదు. రేవంత్ వచ్చి ఓదార్చితే, "కాసేపు నన్ను ఒంటరి వదిలెయ్ బ్రో, టైం పడుతుంది" అని అర్జున్ చెప్పాడు.

ఈ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో అర్జున్ తో పాటు శ్రీసత్య, కీర్తిభట్ కూడా ఏడ్వగా, వాళ్ళు ఫ్యామిలితో మాట్లాడే మాటలు ప్రేక్షకులను హత్తుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ టాస్క్ కారణంగా అందరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గుర్తొచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఈ వారం ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో చూడాలి మరి.