English | Telugu

'మధ్యలో దూరే అవార్డు' గీతూకే!

బిగ్ బాస్ హౌస్ లో విమెన్ ఆల్ రౌండర్ గా తన పర్ఫామెన్స్ తో గీతు ఆకట్టుకుంటోంది అనే విషయం అందరికి తెలిసిందే. కాగా సండే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కావడంతో కమెడియన్ హైపర్ ఆది వచ్చి తన పంచ్ డైలాగ్స్ తో అలరించాడు.

హైపర్ ఆది కంటెస్టెంట్స్ అందరి గురించి ఏదో ఒకటి చెప్తూ కామెడీతో అలరించగా, గీతు గురించి చెప్తూ, "నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. అయితే హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నావు. హౌస్ లో ఏ ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ జరిగినా నీ మాటే వినిపిస్తోంది. గేమ్ పరంగా సూపర్. మాట పరంగా కొంచెం అదుపులో ఉంచుకోవాలి. నోటి దూల బాగా ఉంది. ఎవరిని మాట్లాడనివ్వవు" అంటూ ఆది చెప్పుకొచ్చాడు.

గత వారం కూడా నాగార్జున మాట్లాడుతుండగా మధ్యలో దూరి మాట్లాడితే నాగార్జునకి కోపం వచ్చింది. కాగా అప్పుడే గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. "గీతు ఎవరిని మాట్లాడనివ్వవా" అంటూ కోపంగా అనేసాడు నాగార్జున. అయినా కూడా తన తీరు మార్చుకోలేదు. గీతు ప్రవర్తన కొందరికి చిరాకేస్తోంది మరికొందరికి ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తోంది. తన అటతీరుకి, మాట్లాడే చిత్తూరు యాసకి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది అనే చెప్పాలి. కాగా దీపావళి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కమెడియన్ ఆది కూడా అదే విషయం చెప్పాడు. మధ్యలో దూరే అవార్డు అంటూ ఉంటే మాత్రం గీతూకే వస్తది అని చెప్పగా, "నేను కాదు రేవంత్" అని చెప్పే ప్రయత్నం చేసింది. దానికి బదులుగా ఆది మాట్లాడుతూ, "రేవంత్ అందుకునేలోపే నువ్వే మధ్యలో దూరి అవార్డు అందుకుంటావు" అని అనడం తో హౌస్ లో నవ్వులు పూసాయి.

గీతు ఆది చెప్పిన మాటలను మనసులో పెట్టుకొని మసులుకుంటుందో? లేక వదిలేస్తుందో చూడాలి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..