English | Telugu
మా ఇద్దరి మధ్య గొడవలు...షాకింగ్ న్యూస్ చెప్పిన హైపర్ ఆది!
Updated : Dec 31, 2022
జబర్దస్త్ లో హైపర్ ఆది అంచలంచెలుగా ఎదిగి టీం లీడర్ అయ్యాడు. అన్ని కామెడీ షోస్ లో ఆయన పంచ్ డైలాగ్స్ ఉండనిదే ఆ ప్రోగ్రాం చూసినట్టు ఉండదని భావిస్తున్నారేమో నిర్వాహకులు అందుకే ప్రతీ షోలో హైపర్ ఆది లేకుండా మాత్రం షో ఉండదు. అటు బిగ్ స్క్రీన్ మీద అవకాశం వచ్చినప్పుడు నటిస్తూ, స్మాల్ స్క్రీన్ మీద ఆది లేనిదే షో లేదు అన్నట్టుగా జెండా పాతేసాడు. అలాంటి హైపర్ ఆదికి మరో కమెడియన్ తో గొడవలు ఉన్నాయన్న విషయం తెలుసా...ఆ విషయాన్ని తానే స్టేజి మీద బయట పెట్టాడు. కమెడియన్ సద్దాంతో తనకు మనస్పర్థలు ఉన్నాయన్న విషయం బయట పెట్టి షాకిచ్చాడు.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఈటీవీలో "క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ" పేరుతో ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం కాబోతోంది. ఈ ప్రోమో చూస్తే ఫైనల్ లో ఆది తన మనసులో మాట చెప్పాడు. "2022 లో నాకు సద్దాం గాడికి చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. అవి ఈ 2023 లో పూర్తిగా పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని కేక్ తినిపించాడు. ఐతే వాళ్ళ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, ఎప్పటి నుంచి ఈ గొడవలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ఆది చెప్పేవరకు ఎవరికీ తెలియదు.
అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలి అంటే డిసెంబర్ 31 రాత్రి 9 .30 గంటలకు ప్రసారమయ్యే క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ ప్రోగ్రాం ని చూడాల్సిందే.