English | Telugu

ట్విట్టర్ లో తమిళ నటుడు సంతానంని దుమ్ము దులిపిన రష్మీ!

రష్మీ యాంకర్ గానే కాదు మూగ జీవాల పాలిట ఒక దేవత లాంటిది కూడా. ఎక్కడ ఏ మూగ జీవికి హాని జరిగినా తట్టుకోలేదు. జంతువధ మీద గొంతెత్తి మాట్లాడుతుంది. స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడుతుంది. దత్తత తీసుకుంటుంది. అడిగినవారికి కూడా ఇస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూల్ ఉండే రష్మీ ఇప్పుడు తమిళ నటుడు సంతానం మీద ఫైర్ అయ్యింది. ఇంతకూ ఏమయ్యింది అంటే... రీసెంట్ గా తమిళ నటుడు సంతానం వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడ మత్తులో ఉన్న ఒక పెద్ద పులి పడుకుని ఉండగా దాని వెనక కూర్చుని తోక పట్టుకున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఇక ఈ వీడియో మీద పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పులిని అంత బాధపెడుతూ పైగా "టైగర్ లవ్" అని హాష్ ట్యాగ్ పెట్టిన సంతానం మీద రష్మీ ట్విట్టర్ లో మండిపడింది. ఆ వీడియోలో సంతానం పులి తోక పట్టుకున్నా కూడా అది నీరసంగా తలవాల్చేసి పడుకుంది. దీంతో "పులి స్లీపింగ్ ఆర్ వ్వాట్ ? పులి పడుకుందా" అని అడిగేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి వెంటనే ఎలక్ట్రిక్ స్టిక్ తో షాకిచ్చి పులిని లేపాడు. అది తల విదుల్చుకుని సడెన్ గా లేచింది.

ఇక ఈ వీడియోని చూసిన రష్మీకి కోపం పీకల వరకు వచ్చేసింది. " మీ సరదా కోసం ఏ జంతువునైనా హింసించడం, చంపడం తప్పు..జంతువుకి డ్రగ్స్ ఇచ్చి వాటి పక్కన కూర్చుని ఇలాంటివి చేయడం చాలా ఘోరం. ఇలాంటి ప్లేసెస్ ని ఇన్ డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని సంతానం గ్రహించాలి. ఒక జంతువుని ఇలా తన సహజ జీవితానికి దూరం చేయడం అస్సలు బాలేదు" అని ట్వీట్ చేసింది.