English | Telugu

నువ్వసలు ఆడదానివే కాదేమో అని డౌట్!

'దసరా వైభవం' పేరుతో ఈటీవీలో ప్రసారమైన ఈవెంట్ అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి 'జబర్దస్త్' ఫామిలీ, సీనియర్ ఆర్టిస్ట్స్ అంతా వచ్చారు. రోజమ్మ ఇంటికి అందరినీ ఆహ్వానించింది. "అందుకే మనమంతా ఇక్కడికి వచ్చాం" అంటూ షో స్టార్ట్ చేసింది శ్రీముఖి.ఆమె, ఆది మధ్య భయంకరమైన పంచ్ డైలాగ్స్ పేలాయి.

"షోలో అరవటానికే నిన్ను తెప్పించారు శ్రీముఖి" అని ఆది అనేసరికి శ్రీముఖి కౌంటర్ వేసింది. "ఏంటి ఆది.. రోజమ్మ ఇంట్లో ఫంక్షన్ మంచి కలరింగ్స్ వస్తారని తెలిసి కొత్త డ్రెస్ వేసుకొచ్చావా.. బాగా స్కెచ్ వేసావ్ ఐతే" అని అనేసరికి "నేను స్కెచ్ వేశాను కానీ నువ్వే మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తున్నావ్ అంటే నాకంటే ముందే నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావన్నమాటష‌ అన్నాడు ఆది. దాంతో బిత్త‌ర‌పోవ‌డం శ్రీ‌ముఖి వంత‌యింది.

ఆ వెంటనే ఆది అందుకుని "మరి ఈ రోజు రోజమ్మ ఇంట్లో ఎలాంటి పార్టీ ప్లాన్ చేసావ్?" అని అడిగాడు. "నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో" అంటూ డాన్స్ చేసిందామె. "అలాంటి ఇలాంటి ఆడదానివేంటి.. నువ్వసలు ఆడదానివే కాదేమో అని డౌట్" అంటూ ఆది వేసిన చెత్త డైలాగ్ కి అందరూ పడీ పడీ నవ్వేశారు.

ఆ త‌ర్వాత అంద‌రూ రోజ‌మ్మ ఇంట్లోకి అడుగుపెట్టారు. "రోజమ్మ అంటే ఎవరు.. ఒక ఫైర్ బ్రాండ్.. మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుంది?" అని శ్రీముఖి అడిగేసరికి, "నీకు నువ్వే చెప్పాలి ఏ బ్రాండో" అంటూ మరో కౌంటర్ వేశాడు ఆది.