English | Telugu
బిగ్ బాస్ బర్త్ డే వేడుకల్లో కంటెస్టెంట్స్!
Updated : Oct 6, 2022
ముప్పైవ రోజు 'బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు' జరిగాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నా బర్త్ డే వేడుకలు చాలా గ్రాండ్ గా, ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు.
ఒక్కో కంటెస్టెంట్ తమ ప్రతిభను చాటుకున్నారు. సూర్య తన మిమిక్రీతో హౌస్ లో అందరిని అలరించాడు. ఐతే ఈ మిమిక్రీ లో 'చిరంజీవి' లా చేసి వహ్వా అనిపించాడు. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య కలిసి డ్యాన్స్ చేయగా అందరూ ఎంజాయ్ చేసారు. అర్జున్ మాత్రం ఫీల్ బాగా అయినట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఫైమా, అర్జున్ లు డ్రామా కొనసాగించారు. ఫైమా తన పంచులతో హౌస్ మొత్తాన్ని కడుపుబ్బా నవ్వించగా, సూర్య మాత్రం ఫైమా పంచ్ లకు రియాక్షన్ ఇస్తూ, కౌంటర్ ఎటాక్ లతో సరదాగా గడిపాడు.
అయితే ఈ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా గీతుని కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళమని చెప్పాడు బిగ్ బాస్. గీతుకి సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అలా ఏం ఇవ్వకుండా సరదగా ఆటపట్టించాడు. ఆ రూమ్ లోకి వెళ్ళాక, "గీతు అక్కడ ప్లేట్ లో KFC చికెన్ ఉంది. అది నీకు కావాలంటే హౌస్ మేట్స్ పై గాసిప్స్ చెప్పి నన్ను మెప్పించాలి" అని చెప్పాడు. ఆ తర్వాత ఫైమా కి సీక్రెట్ టాస్క్ ఇవ్వగా, తను అందులో గెలవలేకపోయింది. కెప్టెన్ బాధ్యతల కోసం కంటెస్టెంట్స్ అందరూ గట్టిగానే పర్ఫామెన్స్ ఇస్తున్నారు.