English | Telugu
గ్రాండ్ గా రాకేష్ తమ్ముడి కూతురు బర్త్ డే ఫంక్షన్!
Updated : Nov 12, 2022
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. ఇక రాకేష్ ఇటీవలి కాలంలో జోర్దార్ సుజాతతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఏ షోలో ఐనా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించారు కూడా. పెళ్లవకుండానే ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ కి వెళ్లొచ్చారు. ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఐతే రీసెంట్ గా వీళ్ళ ఇంట్లో ఎంతో గ్రాండ్ గా జరిగిన ఒక ఫంక్షన్ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ కంటే ముందే అతని తమ్ముడికి 2021 జనవరిలో వివాహం జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ పెళ్లికి జోర్దార్ సుజాత కూడా వెళ్ళింది.
ఇక ఇటీవల రాకేష్ తమ్ముడి కూతురు నక్షత్ర ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు రాకేష్ తో పాటు జోర్దార్ సుజాత, శివబాలాజీ, ధన్ రాజ్, రచ్చ రవి, శ్రీవాణి, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి లాంటి సెలబ్రిటీలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఇక ఈ చిన్నారికి నెటిజన్స్ అందరూ విషెస్ చెప్పారు.