English | Telugu

ఇచ్చిన మాట నిలబెట్టుకుని డాన్స్ చేసిన హైపర్ ఆది!

బిగ్గెస్ట్ రియాలిటీ డాన్స్ షో "ఢీ". 14 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ స్టేజ్ నుంచే ఎంతో మంది డాన్సర్లు మాస్టర్లు అయ్యారు. ఇక ఇప్పుడు ప్రసారమవుతున్న ఈ షో సీజన్ 14 చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. టైటిల్ ఎలాగైనా కొట్టాలి అని కొరియోగ్రాఫర్స్ అంతా తమ టాలెంట్ ని బయటికి తీస్తున్నారు. గతవారం ఎపిసోడ్ లో అఖిల్ తో పాటు మరో లేడీ టీమ్ లీడర్ శ్వేతా నాయుడు చేసిన డాన్స్ తో అందరూ ఫిదా ఇపోయారు. వీళ్ళను చూసిన హైపర్ ఆది. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను కూడా డాన్స్ చేస్తాను అంటూ శపథం చేశాడు. ఆయన శపథం గురించి ప్రదీప్ జోక్ కూడా వేసాడు.

కానీ ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని తెలుస్తోంది. ప్రత్యేకంగా డాన్స్ నేర్చుకుని వచ్చి మరీ పెర్ఫార్మ్ చేసాడు. జడ్జి పూర్ణ కూడా ఆది డాన్స్ చూసి వచ్చి అతనితో కలిసి స్టెప్పేసి బాగా చేసావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది.