English | Telugu
కవులకు కౌంటర్ వేసిన రాకెట్ రాఘవ...ఆడవాళ్లనే పొగుడుతారంటూ ఫైర్
Updated : Dec 14, 2023
ఈ వారం జబర్దస్త్ షోలో స్కిట్స్ అన్నీ కూడా చాల వెరైటీగా ఉన్నాయి. అందులో రాకెట్ రాఘవ స్కిట్ ఐతే భలే నవ్వు తెప్పించింది. ఈ స్కిట్ లో రాఘవ కవుల మీద ఫైర్ కూడా అయ్యాడండోయ్.. స్కిట్ లో భాగంగా రాఘవ పెళ్ళానికి ఒకసారి నెక్లెస్ దొరికిందట. ఐతే దాన్ని అక్కడే వదిలేసి వచ్చిందట. తీరా ఎందుకు వదిలేసిందో కనుక్కుంటూ దాని డిజైన్ నక్కలేదట. ఇలాంటి తింగరిది ఇంకా ఎక్కడన్నా ఉంటుందా అంటూ ఇంద్రజకి చెప్పాడు.
ఇక ఆమె పగలబడి నవ్వింది. "అసలు దీన్ని కాదండి అనాల్సింది..కవుల్ని. కవులు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ అందాలనే పొగుడుతూ ఉంటారు. మగవాళ్ల అందాల్ని అస్సలు పొగడరు. ఎందుకో తెలుసా అండి మా అందాలను పొగడడానికి పదాలు సరిపోవు." అనేసరికి "ఎందుకు సరిపోవు..సరిపోతాయి" అని రాఘవ వైఫ్ గట్టిగా చెప్పి బ్యాక్ గ్రౌండ్ లో " సచ్చినోడా" అనే సాంగ్ ని ప్లే చేయించి రాఘవ పరువు నిలువునా తీసేసింది. ఇక రాఘవ స్కిట్ చాల ఫన్నీగా సాగింది. అనగనగా రాజు రాజుకు ఏడుగురు కొడుకులు కాన్సెప్ట్ లో అనగనగా రాఘవ...రాఘవకు ఏడుగురు భార్యలు అనే ఈ స్కిట్ లో ఒక భార్యకు తమ్ము గండం ఉందని తుమ్మితే పోతుందంటూ ఏడు పెళ్లిళ్లు చేసుకోవడం రాఘవ రెడీ అవడం చివరికి ఆ పెళ్లిళ్ల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో రాఘవ పెళ్ళాల చేతుల్లో తన్నులు తినడం ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇక కృష్ణ భగవాన్ ఐతే రాఘవని తెగ పొగిడేశారు. ఇలాంటి కథ ఎలా ఆలోచించారు. ఈ కాన్సెప్ట్ ఆలోచించడమే చాల కష్టం కదా..ఇంతకు సమరంలో సలహాలు, కాపురంలో కలహాలు డైలాగ్ సూపర్ గా ఉంది. ఎప్పుడు అన్నీ స్కిట్స్ బాగున్నాయని ఊరికే చెప్తుంటాం..కానీ ఇప్పుడు స్కిట్ మాత్రం చాల బాగుంది అని చెప్పారు.