English | Telugu
సెట్లో హైపర్ ఆది అరెస్ట్.. కాలర్ పట్టి పోలీసుల వీరంగం!
Updated : Jun 7, 2022
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల్లో తనదైన స్కిట్ లతో ఆకట్టుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది ఆ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు. ఇదిలా వుంటే హైపర్ ఆది `శ్రీదేవి డ్రామా కంపెనీ` కామెడీ షో షూటింగ్ జరుగుతుండగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం ఇప్పుడు షాక్ కు గురిచేస్తోంది. ఇంద్రజ ప్లేస్ లో జడ్జిగా పూర్ణ, సుడిగాలి సుధీర్ ప్లేస్ లో యాంకర్ గా రష్మీ గౌతమ్ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ షో కొత్త కళని సంతరించుకుంది. సుడిగాలి సుధీర్ షోలో లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కలిసి స్కిట్ లు చేస్తూ నవ్విస్తున్నారు.
తాజాగా వచ్చే ఆదివారం జూన్ 12న మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ప్రోమో స్టార్టింగ్ లోనే ఆటో రామ్ ప్రసాద్.. హైపర్ ఆదికి సన్మానం ఏర్పాటు చేశాడు. "అంటే సన్మానం చేసి నన్ను కూడా పంపించేద్దామనుకుంటున్నావా?" అంటూ హైపర్ ఆది పంచ్ వేశాడు. ఆదికి సన్మానం జరుగుతుండగానే ఓ అమ్మాయి ముఖం కనిపించకుండా చున్నీ కట్టుకుని వచ్చేసి.. "ఇక్కడొక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మీరంతా కలిసి సంతోషంగా సన్మానం చేసుకుంటున్నారా?" అంటూ షాకిచ్చింది.
కట్ చేస్తే.. షోలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆది ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తుండగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు "కెమెరాలు ఆపండీ" అంటూ షాకిచ్చారు. "ఆది ఎక్కడండీ.. ఆది ఎక్కడ?" అంటూ హంగామా చేశారు. ఇది చూసిన పూర్ణతో సహా అంతా షాక్ అయ్యారు. షోలో వున్న వాళ్లకి, టెక్నికల్ టీమ్ కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. స్టేజ్ పైకి వెళ్లిన పోలీసులు "ఉదయం ఏం జరిగిందో తెలుసా? కార్ లో వస్తూ ఓ వ్యక్తికి యాక్సిడెంట్ చేశారు. అతను ఇప్పడు చావు బ్రతుకుల్లో వున్నాడు." అని చెప్పారు. వెంటనే ఓ వ్యక్తి స్టేజ్ పైకి వచ్చి "షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా కాదు ఒకసారి పక్కకు రండి" అన్నాడు. "అతను వస్తానంటుంటే నువ్వు ఎవరయ్యా పక్కకుపో ఫస్టు" అంటూ పోలీసులు వీరంగం వేశారు.
ఇంతలో ఆటో రామ్ ప్రసాద్ తో పాటు కమెడియన్స్ అంతా స్టేజ్ పైకి వెళ్లి పోలీసులతో చర్చించారు. అయినా పోలీసుల్లో ఓ వ్యక్తి వినకుండా తనని ఆపడానికి ట్రై చేసిన వారిపై సీరియస్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే మొదటి నుంచి వీరంగం వేస్తున్న పోలీస్ 'ఫస్ట్ కెమెరాలు ఆపుచేయండి' అంటూ కర్ర చూపించి సెట్ లో వున్న వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఆది నిజంగానే యాక్సిడెంట్ చేశాడా?.. షోని హైలైట్ చేయడంలో భాగంగానే ఈ స్టంట్ ని టీమ్ ఏర్పాటు చేసిందా? అన్నది తెలియాలంటే జూన్ 12న ప్రసారం అయ్యే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతోంది.