English | Telugu
బాల పూజాలో వేదని అవమానించిన మాళవిక
Updated : Jun 7, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్నసీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది. తల్లి పురిట్లోనే వదిలేసిన ఓ పాపకు, పిల్లలే పుట్టరని తెలిసిన ఓ డాక్టర్ కు మధ్య పెనవేసుకున్న అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ ని చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. హిందీ సూపర్ హిట్ సీరియల్ `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజన్ బీఎస్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, బేబీ మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర, వరదరాజులు నటించారు. గత కొన్ని రోజులుగా బాల పూజ చేయాలని భావించిన యష్ తల్లి మలబార్ మాలిని పరిస్థితులన్నీ చక్కబడటం, యష్ కు భార్యగా వేద రావడం..ఖుషీకి మంచి తల్లి లభించడంతో మాలిని `బాల పూజా`కు ఏర్పాటు చేస్తుంది. యస్, వేద పీటలపై కూర్చుని ఖుషీ కోసం బాల పూజా చేయడం మొదలు పెడతారు. ఇంతలో `ఆపండి` అంటూ యష్ మాజీ భార్య మాళవిక ఎంట్రీ ఇస్తుంది.
కన్నతల్లిని నేను బ్రతికి వుండగా పిల్లలే పుట్టని వేదతో బాల పూజ ఎలా చేయిస్తారంటూ మాలిని కుటుంబ సభ్యులని నిలదీస్తుంది. ఆ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన యష్ తల్లి మాలిని `అది చెప్పడానికి నువ్వు ఎవరే మర్యాదగా బయటికి పో` అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. నేను అన్ని ఏర్పాట్లతోనే వచ్చానని, ఎవరూ అరవకుండా నోరు మూసుకుని నేను చెప్పింది వినమని హెచ్చరిస్తుంది మాళవిక. యష్ పక్కన పీటలపై కూర్చున్న వేదని పైకి లేవే అంటూ అవమానిస్తుంది. యష్ ఆగ్రహంతో ఊగిపోతున్నా వేద అతన్ని కంట్రోల్ చేస్తూ ఆపుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? మాళవిక ప్లాన్ వర్కవుట్ అయిందా? .. ఇంతకి బాల పూజని యష్ ఎవరితో కలిసి చేశాడు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.