English | Telugu
మ్యూజిక్ కచేరి... దీపికాని రూమ్‌కి రామన్న హైపర్ ఆది!
Updated : Aug 12, 2023
"ఢీ ప్రీమియర్ లీగ్ " ఈటీవీలో మంచి జోష్ తో దూసుకెళుతున్న డాన్స్ షో. ప్రతి బుధవారం రాత్రి 9:30 కు ప్రసారమవుతోంది. టీవీ షోస్ లోనే నెంబర్ వన్ షోగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ "ఢీ ప్రీమియర్ లీగ్ " ప్రోమో రిలీజ్ అయింది. హోస్ట్ ప్రదీప్ తో పాటు శేఖర్ మాష్టర్ ,దీపికా పిల్లి , జడ్జి పూర్ణ ఎంట్రీ ఇచ్చి "నర్సాపెల్లె" సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేశారు. అలాగే "బోలా శంకర్" మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా వచ్చారు. హైపర్ ఆది ఎంట్రీ అంటే మాములుగా ఉండదుగా రచ్చ. ఆది పక్కన వున్న అతని "అరేయ్ రికార్డు చేయి" అని అన్నాడు . అప్పుడు హైపర్ ఆది ,ప్రదీప్ నటించిన "30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే మూవీలోని "నీలి నీలి ఆకాశం" అనే పాటను పాడాడు.. "ఎలా వచ్చిందిరా అని పక్కన కమెడియన్ ని అడిగేసరికి అలాగే వచ్చిందని చెప్పిన ఆన్సర్ తో అందరూ నవ్వేశారు.
తర్వాత " కింగ్ " మూవీలో బ్రహ్మానందం చేసిన కామెడీ బిట్ ని ఇక్కడ స్పూఫ్ గా చేసి చూపించారు హైపర్ ఆది, దీపికా పిల్లి. దీపికా పిల్లి ఒక సాంగ్ పాడేసరికి హైపర్ ఆది "స్టాప్ ఇట్" అని లేచి "నువ్వు ఎంచుకున్నరాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి" అనేసరికి అందరూ నవ్వేశారు. ఈ కామెడీ సీన్ అయ్యాక కింగ్స్ ఆఫ్ కరీంనగర్ డాన్స్ చూసిన మెహెర్ రమేష్ "నేను చుసిన బెస్ట్ వైబ్రేటింగ్ పెర్ఫార్మెన్స్" అని కామెంట్ చేశారు. తరువాత హైపర్ ఆది ఒక మ్యూజిక్ కచేరి పెట్టి కామెడీ చేసాడు. అందులో పాడిన పాట ఎలా ఉంది అని మెహర్ రమేష్ ని అడిగేసరికి "ఒరిజినల్ లానే ఉంది" అని ఆన్సర్ ఇచ్చారు మెహర్ రమేష్. ఆ మాటకు ఆది ముఖం వాడిపోయింది. తర్వాత వాల్తేరు వారియర్స్ వర్సెస్ హైదరాబాద్ ఉస్తాద్స్ మధ్య పోటీ గట్టిగానే జరిగింది. వాళ్ళ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇక హైదరాబాద్ ఉస్తాద్స్ డాన్స్ ని చూసి అక్కడున్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇలా ఈ ప్రోమోని ఎండ్ చేశారు. మరి మెహర్ రమేష్ ఈ ఎపిసోడ్ వచ్చారు కాబట్టి ఎలాంటి కామెంట్స్ చేశారు ఆది ఎలా నవ్వించాడో తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.