English | Telugu
మోనితని టెన్షన్ పెడుతున్న తులసి!
Updated : Feb 19, 2021
డైలీ సీరియల్ `కార్తీక్ దీపం` క్లైమాక్స్‌కి వచ్చేసిందా? అనే లోపు రసవత్తర మలుపులు, ట్విస్టులతో షాకిస్తోంది. విహారి కారణంగా డాక్టర్ బాబు, దీపల మధ్య మనస్పర్థలు పెరగడం.. దీపని తన ఇంటి నుంచి డాక్టర్ బాబు వెలివేయడం.. ఇద్దరు పిల్లలో పెద్ద పాప శౌర్యతో వంటలక్కగా జీవితాన్ని దీప సాగించడం.. మరో పాప హిమని సౌందర్య తన తనయుడు డాక్టర్ బాబు చెంతకు చేర్చడం తెలిసిందే.
అయితే ఈ మొత్తం కథ గాడి తప్పడానికి.. దీప - డాక్టర్ బాబు విడిపోవడానికి కారణంగా విహారి. అయితే అతన్ని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడిన మోనిత తన ప్లాన్‌తో దీప - డాక్టర్ బాబుని శాశ్వతంగా విడగొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇదిలా వుంటే విహారి భార్య తులసికి విహారి సంసార జీవితానికి పనికిరాడన్న నిజం తెలుస్తుంది. ఆ నిజం చెప్పేసి దీప - డాక్టర్ బాబుల మధ్య అపార్థాల్ని తొలగించాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా దీపని కలిసి విషయం చెప్పాలని ఇంటికి వెళుతుంది. కానీ ఇంట్లో దీపి లేకపోవడం, అక్కడే దీప తండ్రి వుండటంతో అసలు విషయం చెప్పక దీపని తను కలవ మన్నానని చెప్పి వెళ్లిపోతుంది.
ఇంతలో తులసి గురించి మోనిత టెన్షన్ పడుతూ వుంటుంది. విహారి వల్ల తులసికి పల్లలు పుట్టే అవకాశం లేదని కార్తీక్‌కి తెలిస్తే ఇంకేమైనా వుందా?.. కార్తీక్ అనుమానంతో ఎంక్వైరీ మొదలుపెడితే .. డొంకంతా కదులుతుంది. దీని వెనకుంది నేనేనని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మడు. ఇప్పుడు ఏం చెయ్యాలి. దీప తులసిని కలిసినా డేంజరే.. విషయం తెలిస్తే దీప ఊరుకోదు.. సౌందర్యకు చెప్పేస్తుంది. ఆ తరువాత కార్తీక్‌కి తెలుస్తుంది. అంతా ఒక్కటైపోతారు నో.. అలా జరగడానికి వీళ్లేదు` అని శుక్రవారం ఎపిసోడ్‌లో మోనిత కంగారు పడుతూ వుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? కార్తీక్‌కి అసలు విషయం తెలిసిందా.. రేపటి ఎపిసోడ్‌కి సాగదీశారా అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.