English | Telugu
ఈల వేసి రచ్చ చేస్తున్న రష్మీ గౌతమ్
Updated : Feb 19, 2021
బుల్లితెర యాంకర్స్ సందు దొరికితే చాలు అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో టాపు లేపేస్తున్నారు. తమ టాలెంట్‌ని పూర్తి స్థాయిలో ప్రదర్శించే స్టేజీ లభిస్తే చాలు ఓ రేంజ్‌లో అదరిగొట్టేస్తున్నారు. సరిగ్గా బుల్లితెర అందాల బొమ్మ రష్మీ గౌతమ్ అదే పని చేసింది. తన డ్యాన్స్ టాలెంట్‌ని బయటపెట్టే అవకాశం రాగానే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేసుకుంది.
ఈల వేసి గోల చేసింది. అదిరిపోయే స్టెప్పులతో ఓ రేంజ్‌లో అల్లాడించింది. `నా అందాల చూసీ కుర్రాళ్లు టెమ్ట్ అయితే నా తప్పు ఏమున్నదబ్బా అంటూ కన్ను గీటి అదిరిపోయే మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. గులాబీ కలర్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ రష్మీ గౌతమ్ చేసిన రచ్చ నెట్టింట, యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. `స్టార్ మా`లో 6 రియల్ కపుల్స్, 6 రీల్ కపుల్స్‌లో `100% లవ్` పేరుతో ఓ ఎంటర్‌టైనింగ్ షోని ప్రారంభించబోతున్నారు.
ఈ నెల 21న ప్రారంభిం కానున్న ఈ షోకు యాంకర్ రవి, వర్షిణి సౌందరరాజన్ వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో `నా తప్పు ఏమున్నదబ్బా..` అనే పెప్పీ మాస్ ఐటమ్ నంబర్‌కు రష్మీ గౌతమ్ వీర లెవెల్లో పక్కా మాస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన ప్రోమో స్టార్ మా అఫీషయల్ ట్విట్టర్ పేజీలో సందడి చేస్తోంది. రష్మీ గౌతమ్ అభిమానులకు ఈ సాంగ్ ఓ పండగే.. అంతలా రష్మీ ఈ పాటలో అందాలు ఆరబోసి ఊర మాస్ స్టెప్పులతో విజిల్స్ వేస్తూ రచ్చ చేసింది.