English | Telugu

హ‌రితో ఆట ఆడేసుకున్న అశురెడ్డి!

బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఫేమ్ అశురెడ్డి క‌మెడియ‌న్ హ‌రితో ఓ ఆట ఆడేసుకుంది. త‌ను ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తుంటే ప‌ట్టుకోవాల‌ని.. హ‌గ్ చేసుకోవాల‌ని ట్రై చేస్తున్న హ‌రికి హ‌గ్ తో పాటు ముద్దిచ్చి షాకిచ్చింది. ఊహించ‌ని ప‌రిణామానికి హ‌రి కంటే శేఖ‌ర్ మాస్ట‌ర్ ఒక్క‌సారిగా షాకై కేక‌లు వేయ‌డంతో అక్క‌డున్న వారంతా ఘొల్లున అరిచారు. ఈ స‌ర‌దా స‌న్ని వేశం `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న `కామెడీ స్టార్స్‌`లో చోటు చేసుకుంది.

ఇటీవ‌లే `స్టార్ మా`ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని రెట్టింపు చేస్తూ బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్‌, జ‌బ‌ర్ద‌స్త్ కమెడియ‌న్ ముక్కు అవినాష్‌తో `కామెడీ స్టార్స్‌`పేరుతో ఓ కామెడీ షోని ప్రారంభించింది. ఓంకార్ ప్రెజెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి వ‌ర్షిణీ సౌంద‌ర‌రాజ‌న్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ముక్కు అవినాష్‌, అశురెడ్డి, అరియానా, హ‌రి, చ‌మ్మ‌క్ చంద్ర కంటెస్టెంట్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

శేఖ‌ర్ మాస్ట‌ర్ , హీరోయిన్ శ్రీ‌దేవి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్‌ చేశారు. `గాజు బొమ్మ‌వో.. ` అంటూ సాగే పాట‌కు బ్లూ క‌ల‌ర్ సారీలో చిందులేసిన అశురెడ్డి త‌న ప‌క్క‌నే వున్న హ‌రిని ముద్దు పెట్టుకుని హ‌గ్గివ్వ‌డంతో శేఖ‌ర్ మాస్ట‌ర్ ఒక్క‌సారిగా ఘొల్లున అర‌వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ షోలో ఈ ఇద్ద‌రూ క‌లిసి ఏ రేంజ్‌లో ర‌చ్చ చేశారో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం ప్ర‌సారం అయ్యే `కామెడీ స్టార్స్‌` చూడాల్సిందే.