English | Telugu

అవినాష్‌కు రింగ్‌తో అరియానా ప్ర‌పోజ‌ల్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ముక్కు అవినాష్‌, అరియానాల జోడీ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. హౌస్‌లో ఒక‌రిని విడిచి ఒక‌రు వుండ‌క‌పోవ‌డం.. చుట్టూ కెమెరాలున్నాయ‌న్న సంగ‌తే మ‌రిచి హౌస్‌లో వున్న సోఫాల‌పై చేతి వేళ్ల‌తో అరియానాపై ఏవేవో రాయ‌డం.. ఆ త‌రువాత కింగ్ నాగార్జునకు అడ్డంగా దొరికి పోవ‌డం తెలిసిందే. చివ‌రికి దాకా వున్న అవినాష్, అరియానాల మ‌ధ్య మంచి బంధం ఏర్ప‌డింద‌ని అంతా అనుకుంటున్నారు.

హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కూడా వీర‌ద్ద‌రి మ‌ధ్య అదే అనుబంధం కంటిన్యూ అవుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గోవాలో బైక్‌పై తిరుగుతూ హ‌ల్‌చ‌ల్ చేసిన వారు, `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న `కామెడీ స్టార్స్‌`షోతో పాటు ఓంకార్ నిర్వ‌హిస్తున్న `డ్యాన్స్ ప్ల‌స్‌` షో లోనూ ఎంట్రీ ఇచ్చి వీర లెవెల్లో అద‌ర‌గొట్టారు. ఒకరి కోసం ఒక‌రు అన్న‌ట్టుగా బిహేవ్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ఇదిలా వుంటే యాంక‌ర్ సుమ `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న `స్టార్ట్ మ్యూజిక్‌`కి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న అవినాష్‌, అరియానా వీక్ష‌కుల‌కు షాకిచ్చారు. డైమండ్ రింగ్‌తో అవినాష్‌కు అంతా చూస్తుండ‌గానే అరియానా ప్ర‌పోజ్ చేయ‌డంతో యాంక‌ర్ సుమ ఒక్క సారిగా అవాక్క‌యింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మం వ‌చ్చే సండే `స్టార్ మా`లో ప్ర‌సారం కానుంది.