English | Telugu

అనులోకి ప్ర‌వేశించిన రాజ‌నంది‌ని ఎవ‌రు?

`బొమ్మ‌రిల్లు`, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాల న‌టుడు శ్రీ‌రామ్ న‌టిస్తూ నిర్మిస్తున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. ఏజ్ బార్‌ అయిన ఓ కోటీశ్వ‌రుడికీ బ‌స్తీలో వుంటే యువ‌తికీ మ‌ధ్య సాగే ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. ఆర్య‌వ‌ర్థ‌న్‌, అనుల ప్ర‌ణ‌యం నేప‌థ్యంలో రూపొందిన ఈ ధారావాహిక గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ఆర్య‌వ‌ర్ధ‌న్‌, అనుల మ‌ధ్య ఏదో సంబంధం వుంద‌ని గ‌మ‌నించిన అను తండ్రి సుబ్బు త‌న కూతురిని ఆర్య‌వ‌ర్ధ‌న్ నుంచి వేరు చేయాల‌ని, త‌న స్థాయికి త‌గ్గ వ్య‌క్తికిచ్చి అను పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. ఇందు కోసం ఓ కుటుంబాన్ని పెళ్లి చూపుల‌కు ఇంటికి పిలుస్తారు. అక్క‌డికి వ‌చ్చిన అర్య‌వ‌ర్థ‌న్ అల‌స‌లు విష‌యం చెప్ప‌కుండానే మీరా త‌ల్లి చ‌నిపోయింద‌ని జెండే ఫోన్ చేయ‌డంతో అయిష్టంగానే అను ఇంటి నుంచి మీరా ఇంటికి వెళ్లిపోతాడు.

అనుతో ఏకాంతంగా మాట్లాడానికి ఫిక్స‌యిన పెళ్లి కొడుకు సుబ్బుకి ఆ మాట చెప్పి అనుతో ఏకాంతంగా మాట్లాడ‌టం మొద‌లుపెడ‌తాడు.. ఇంత‌లో అత‌ను అను చేయి ప‌ట్టు కోవ‌డంతో త‌ను అనుని కాద‌ని రాజ‌నందిని అని, త‌న ప్రేమ‌కు అడ్డొస్తే స‌హించ‌న‌ని పెళ్లి చూపుల‌కి వ‌చ్చిన వ్య‌క్తిని లేపి అవ‌త‌ల ప‌డేస్తుంది. ఊహించ‌ని సంఘ‌ట‌న‌తో షాక్‌లో వున్న అత‌న్ని అనురాధ చంపాల‌ని చూస్తుంది. ఇంత‌కీ అనురాధ‌లోకి వ‌చ్చిన రాజ‌నందిని ఎవ‌రు? .. ఆమెకీ ఆర్య‌వ‌ర్ధ‌న్‌కి వున్న అనుబంధం ఏంటీ? .. ఆమె ఎందుకు చ‌నిపోయింది? అన్న‌ది తెలియాలంటే బుధ‌వారం జీ టీవిలో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే `ప్రేమ ఎంత మ‌ధురం` చూడాల్సిందే.