English | Telugu

ఇప్పుడు ఈ ఫోటోలు అవసరమా..? అనసూయపై నెటిజన్లు ఫైర్!

బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. చిన్న పిల్లల అవతారమెత్తింది అనసూయ.

రెండు జడలు వేసుకొని పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చింది. తాను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నానంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. "స్కూల్ బ్యాగ్ మర్చిపోయావ్" అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేయగా.. మరో నెటిజన్ అనసూయపై మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో.. ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని.. దీని గురించి ఎలాంటి బాధ లేకుండా ఇలాంటి ఫోటోలు ఎలా పెట్టాలనిపిస్తుందంటూ అనసూయని ప్రశ్నించాడు.

ఈ కామెంట్ చూసిన అనసూయ.. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం.. కాస్త నమ్మకాన్ని కలిగించడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నామంటూ అనసూయ బదులిచ్చింది. అయినప్పటికీ సంతృప్తి చెందని నెటిజన్.. ఇలాంటి సమయంలో జనాలకు కావాల్సింది చేయూత అని.. ఎంటర్టైన్మెంట్ కాదని అన్నారు. మొత్తానికి అనసూయ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయినా.. అనసూయకి ఇలాంటి పోస్ట్ లు, కామెంట్స్ కొత్తేమీ కాదు!