English | Telugu

Guppedantha Manasu:భద్రని పట్టించాను.. ఇక మిగిలింది నువ్వే!

స్టార్ మా టీవీలో ప్రసరమావుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -989 లో.. కాలేజీలో జరిగిన దాని గురించి అనుపమ, మహేంద్ర, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకసారి నువ్వు ఎండీగా కరెక్ట్ అంటారు. ఒక్కసారి కాదని అంటారు. ఏంటి వాళ్ళని మహేంద్ర అనగానే.. వాళ్ళని శైలేంద్ర అలా మాట్లాడిస్తున్నాడని వసుధార అంటుంది. వాడు మాట్లాడిస్తే మాట్లాడతారా.. నీ గురించి వాళ్లకి తెలియదా అని మహేంద్ర అంటాడు. నా గురించి తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారంటే వాళ్ళ మైండ్ శైలేంద్ర ఎంత పొల్యూట్ చేశాడో అర్థం అవుతుందని వసుధార అంటుంది.

ఆ తర్వాత అసలు రిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ అని మహేంద్ర అంటాడు. నన్ను క్షమించండి, నా వల్లే ఇలా జరిగిందని చక్రపాణి అనగానే.. మీరు రిషిని కంటికి రెప్పలా కాపాడారు. శత్రువులు వెనకాల నుండి దాడి చేస్తే మీరేం చేస్తారని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార ఫోన్ మాట్లాడుతు.. రిషి సర్ దొరికారా అంటూ కార్ లో ఒక్కతే వెళ్తుంది. అది విన్న భద్ర.. శైలేంద్ర కి ఫోన్ చేసి రిషి ఎక్కడో ఉన్నాడంట వసుధార వెళ్లింది. ఇక ఆలస్యం చెయ్యను. ఆ వసుధార, రిషి ఇద్దరిని లేపేస్తానని భద్ర చెప్తాడు. మీరు అక్కడకు రండి నేను లొకేషన్ పంపిస్తానని శైలేంద్రకి భద్ర చెప్పి.. వసుధార వెనకాలే ఫాలో అయి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార ఒక దగ్గర ఆగి.. నడుస్తు వెళ్తుంది. భద్ర కూడా వెళ్తు ఉంటాడు. ఎక్కడకి వెళ్ళింది ఇటే వచ్చింది కదా అనుకుంటుండగా వసుధార ఎదరుగా వస్తుంది. నాకు తెలుసురా నువ్వు శైలేంద్ర మనిషివే అని అని వసుధార అనగానే.. ఇప్పుడు తెలిసి ఏం చేస్తావని భద్ర అంటాడు. అప్పుడే అక్కడికి ముకుల్ వస్తాడు. తను ఏం చెయ్యాలో అదే చేస్తుందని ముకుల్ అంటాడు. వెంటనే ముకుల్ కాని స్టేబుల్స్ ని భద్ర దగ్గరికి పంపిస్తాడు. భద్ర పారిపోకుండా కాని స్టేబుల్స్ ఉంటారు. నాకు తెలుసు ఇదంతా కావాలనే చేసానని వసుధార చెప్తుంది. నువ్వే రౌడీలని పెట్టి.. నువ్వే కాపాడి.. మావయ్య గారికి ఎదరుపడి ఇదంతా చేసావ్ కాదా అని వసుధార అనగానే నాకేం తెలియదని భద్ర అంటాడు.

ఆ తర్వాత ఇక నీ పర్ఫామెన్స్ ఆపురా అని వసుధార అంటుంది. నీ చేత ఎలా నిజలు ఎలా బయటపెట్టించాలో నాకు తెలుసంటూ భద్రని అరెస్ట్ చేసి ముకుల్ తీసుకొని వెళ్తుంటే.. నన్ను ఇంత వరకు పోలీసులు అరెస్ట్ చెయ్యలేదు.. నీ సంగతి చెప్తాను అంటు వసుధారకి భద్ర వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత భద్ర రమ్మన్నాడని శైలేంద్ర లొకేషన్ కి వస్తాడు. వసుధార తప్ప అక్కడ ఎవరు ఉండరు. ఏంటి భద్ర కోసం వెతుకుతున్నావా అని శైలేంద్రని వసుధార అనగానే.. ఏం తెలియనట్టు శైలేంద్ర యాక్ట్ చేస్తుంటాడు. నాకు అంతా తెలుసు భద్రని ఆల్రెడీ ముకుల్ కి పట్టించాను. ఇన్ని రోజులు సాక్ష్యం లేక తప్పించుకున్నావ్ కదా.. ఇక అలా ఉండదని శైలెంద్రకి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంటే శైలేంద్ర టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.