English | Telugu

నీ కార్ లో ఎయిర్ బాగ్ లేదా .. ఐతే ఇది వేస్ట్ కార్

గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు యూత్ అంతా మై హార్ట్ ఈజ్ బీటింగ్ అనే సాంగ్ వేసుకుంటారు. అందులో రిషి సర్, వసుకి ఎంత మంది ఫాన్స్ ఉన్నారో అంతేమంది ఫాన్స్ కొత్త రోల్ అనుపమకు, మహేంద్ర భూషణ్ కి కూడా ఉన్నారు. ఇక మహేంద్ర భూషణ్ గా సాయి కిరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేసే వెరైటీ రీల్స్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. సాయికిరణ్ చేసే రీల్స్ అన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక రీల్ ని పోస్ట్ చేశారు. అది మంచి ఫన్నీగ ఉంది. సీరియల్ జగతి రోల్ పూర్తయ్యాక ఎంట్రీ ఇచ్చిన అనుపమతో ఈ వీడియో చేసాడు. సాయికిరణ్ తన కొత్త కార్ ని నీట్ గా తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో అనుపమ వచ్చి "కొత్త కారా" అనేసరికి "అవును మొన్ననే తీసుకున్నా" అన్నాడు సాయికిరణ్. "బాగా క్లీన్ చేస్తున్నారు" అని అను అనేసరికి సిగ్గుపడిపోతూ "థ్యాంక్యూ" అని చెప్పాడు.

"నేను డ్రైవ్ చేసి చూడాలి" అని అను అడిగేసరికి "మీకు డ్రైవింగ్ రాదు కదా" అని అడిగాడు సాయికిరణ్. "ఎవరు చెప్పారు లాస్ట్ మినిట్ లో నేర్చుకున్నా, బాగా డ్రైవ్ చేస్తాను" అని అను చెప్పింది. "ఓహ్ నేర్చుకున్నారా" అని ఆశ్చర్యపోయాడు సాయి కిరణ్. "ఐతే ట్రై చేయండి..బాగుంటుంది " అని ఇద్దరూ కార్ లో కూర్చుకున్నారు. "ముందుగా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి" అనేసరికి "ఒహ్హ్ అది రివర్స్ బ్రేక్ కదా" అని టెన్షన్ పడిపోయాడు సాయికిరణ్. అన్నట్టుగా కార్ రివర్స్ లో వెనక్కి వెళ్ళిపోయింది దాని గురించి ఏమీ ఫీల్ కాకుండా "ఇందులో ఎయిర్ బాగ్ లేదు ఐతే ఇది వేస్ట్ కార్" అని సింపుల్ గా కార్ ని వదిలేసి వెళ్ళిపోయింది అనుపమ. అసలు అక్కడ ఎం జరిగిందో అర్ధం కాకా సాయికిరణ్ నోరెళ్లబెట్టాడు. ఈ వీడియో ఫాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది.