English | Telugu
భార్యని కాపాడుకోడానికి భర్త ధైర్యం చేయగలడా?
Updated : Dec 30, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-959 లో.. శైలేంద్రకి వసుధార కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం ఫణీంద్ర వింటాడు. ఇక అదేంటో తెలుసుకోవాలని కాలేజీకి వస్తాడు ఫణీంద్ర. అప్పటికే ఏదో ఆలోచిస్తున్న వసుధార దగ్గరికి ఫణీంద్ర వస్తాడు. శైలేంద్ర మీద నీకు, మహేంద్రకి ఎందుకు అనుమానమొచ్చింది వాడే తప్పు చేయడు.. నాది గ్యారెంటీ.. శైలేంద్రతో లెటర్ కూడా రాసి తీసుకొచ్చానని చెప్పి వసుధారకి ఆ లెటర్ ని ఇస్తాడు. ఇక మీదట శైలేంద్ర మీ జోలికి రాడని వసుధారతో ఫణీంద్ర చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు.
మరోవైపు అనుపమ, మహేంద్ర ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటారు. రిషి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియట్లేదని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఏమీ కాదని ధైర్యంగా ఉండమని అనుపమ చెప్తుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి వసుధార వస్తుంది. ఏం అయిందని మహేంద్ర అంటే ఫణీంద్ర సర్ లెటర్ ఇచ్చాడు. శైలేంద్ర వల్ల రిషికి ఏం కాదని చెప్పాడని వసుధార అంటుంది. ఇక మహేంద్ర ఎమోషనల్ అవుతూ.. కన్నకొడుకు పాశం అన్నయ్యని ఆలోచింపచేయనిది. మనందరిని మాయచేసిన శైలేంద్ర అన్నయ్యని మాయచేయలేడా అని మహేంద్ర అంటాడు. అదేం ఉండదు.. చట్టం ముందు అందరు సమానమే.. నేరం చేస్తే ఎవరైన శిక్ష అనుభవించాల్సిందేనని వసుధార, మహేంద్రలతో అనుపమ అంటుంది.
మరోవైపు ఇద్దరు ముసలి వాళ్ళు రిషికి నాటు వైద్యం చేస్తుంటారు. రిషి మెలుకవలోకి వచ్చి.. నేను ఇక్కడి ఎలా వచ్చాను అని అడుగుతాడు. అక్కడ దూరంలో చెట్ల పొదలలో గాయాలతో పడి ఉన్న నిన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చి మాకు తెలిసిన నాటువైద్యం చేస్తున్నామని ముసలివాళ్ళు చెప్తారు. మధ్యమధ్యలో వసుధార అంటూ అరుస్తున్నావ్ ఎవరు ఆ పోరీ అని అడుగుతారు. ఆ దేవుడు మా ఇద్దరి కోసమే మీ ఇద్దరిని పంపించాడని వారితో రిషి చెప్తూ ఎమోషనల్ అవుతాడు. ఇక కాసేపటికి శైలేంద్ర పంపిన రౌడీలు రిషి కోసం ఆ ముసలివాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒకడు గాయాలతో ఉన్నాడు కనిపించాడా అని అడుగుతారు. మాకేం తెలియదని ఆ ముసలి వాళ్ళు బయపడుతూ చెప్పేసరికి వారికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళింట్లోకి వెళ్ళి వెతుకుతుంటారు.ఇక రిషి గోడపక్కన దాక్కుంటాడు. అంతా వెతికి రిషి లేడని రౌడీలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషిని చూసిన ఆ ముసలివాళ్ళిద్దరు మళ్లీ పడుకోబెడతారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని రిషితో ఆ ముసలివాళ్ళు చెప్తారు. మరోవైపు భద్ర కొత్త ప్లాన్ వేస్తాడు. ఒక ఖర్చీఫ్ మీద మత్తుమందు చల్లి వసుధారకి ఇవ్వాలనుకుంటాడు. ఇక తరువాయి భాగంలో వసుధారని శైలేంద్ర మనుషులు బలవంతంగా రిషి ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి.. డోర్ కొడుతూ రిషిని బయటకు రమ్మని బెదిరిస్తుంటారు. నువ్వు బయటకు రాకుంటే ఈ వసుధార ప్రాణాలతో మిగలదని బెదిరిస్తారు. ఇక లోపల ఉన్న ముసలివాళ్ళు వద్దు బాబు అని చెప్తుంటారు. మరి రిషి ప్రాణలను లెక్కచేయకుండా బయటకు వచ్చాడా? వసుధారని ప్రాణాలతో కాపడుకున్నాడా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.