English | Telugu
Guppedantha Manasu:ఆ రికార్డెడ్ వాయిస్ విని షాకైన కుటుంబం!
Updated : Dec 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -943 లో... శైలేంద్రకి దేవయాని ఫోన్ చేస్తే ధరణి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు? పనిమనిషి వస్తుందా అని దేవయానికి కోపం వచ్చేలాగా ధరణి మాట్లాడుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఫోన్ తీసుకొని మాట్లాడతాడు.
ఏంటి మమ్మీ టెన్షన్ పడుతున్నావ్ ? MSR తప్పు చేస్తే మనం ఎందుకు బయపడాలని శైలేంద్ర అనగానే.. ఇదంతా నీకెలా తెలుసని దేవయాని అంటుంది. ప్లాన్ చేసిందే నేనే, ఎప్పుడు ఎవరు ఎలా బెహేవ్ చెయ్యాలని రాసిందే నేనే అని శైలేంద్ర అంటాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎండీ సీట్ మాత్రం నాదే అంటూ శైలేంద్ర కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు. మరొకవైపు రిషి అనుపమ మాటలు గుర్తుకు చేసుకుంటాడు. ఆ తర్వాత రిషి కిచెన్ లో వంట చేస్తున్న వసుధార దగ్గరికి వెళ్లి సరదాగా కబుర్లు చెప్తుంటాడు. కాసేపటికి వసుధారని రిషి దగ్గరికి తీసుకొని కిస్ ఇవ్వబోతుంటే.. అప్పుడే రిషికి ముకుల్ కాల్ చేసి.. కేసుకి సంబందించి ఒక వాయిస్ రికార్డు దొరికిందని ముకుల్ చెప్పి.. మీ ఫ్యామిలీ అందరూ విని వాయిస్ ఎవరిదో గుర్తుపట్టాల్సి ఉంటుందని అంటాడు. ఎక్కడ కలుద్దామని ముకుల్ అడుగగా.. పెద్దమ్మ ఇంటికి రండి అని రిషి చెప్తాడు.
మరొకవైపు ఏదో క్లూ దొరికిందంట అని వసుధారకి రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషి, వసుధార, మహేంద్ర కలిసి ఫణింద్ర, దేవయాని దగ్గరికి వస్తారు. ఏం క్లూ దొరికిందని అన్ని క్వశ్చన్స్ దేవయాని కంగారుగా ఆడుగుతుంది. అప్పుడే ముకుల్ వచ్చి అందరికి వాయిస్ రికార్డు వినిపిస్తాడు. అందులో శైలేంద్ర రౌడీతో మాట్లాడింది ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఇది శైలేంద్ర వాయిస్ అని ఫణీంద్ర ఆశ్చర్యపోతాడు. అతన్ని ఒకసారి విచారించాలని ముకుల్ అనగానే.. వద్దని నా కొడుకు వాయిస్ కాదంటు దేవయాని అంటుంది. రిషి దగ్గరకి వెళ్లి.. నువ్వేం మాట్లాడవేంటని రిషితో ముకుల్ అనగానే.. రిషి ఆశ్చర్యపోయి నన్ను కాసేపు వదిలెయ్యండి అంటూ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.