English | Telugu

Brahmamudi:ఇంటికోడలిని ఇలా పరీక్షించాలా అంటూ కన్నెర్రచేసిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -267 లో.. కావ్య, రాజ్ కలిసి కారులో వెళ్తుంటారు. ‌ఎక్కడికి వెళ్తున్నామని రాజ్ అనగానే.. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ కోసమని కావ్య అంటుంది. ‌ఒక్కసారిగా షాక్ అయిన రాజ్.. అంటే నీకు అని డౌట్ పడతాడు. అంతలేదు నీకు నాకు మధ్య ఇంకా చాలా దూరం ఉందని కావ్య అంటుంది. అరుణ్ ఉండే హాస్పిటల్ కి వెళ్ళి కనుక్కుందామని కావ్య అంటుంది.

మరోవైపు స్వప్న కడుపుతో ఉందంట అని అన్నపూర్ణతో కనకం అనగానే.. పోనీలేవే దానికి ఆ దేవుడే ఒక దారి చూపించాడని అన్నపూర్ణ అనగానే.. నాకు కూడా ఒక దారి చూపించాడు. స్వప్న కడుపు వంకతో ఆ ఇంట్లో తిష్ట వేసి కళ్యాణ్, అప్పులని కలిపేస్తానని కనకం అంటుంది. నీలో పాత కనకం కన్పిస్తుందని అన్నపూర్ణ అనగానే.. ఆ కనకం, ఈ కనకం ఒక్కటే అక్క.. అవసరాన్ని బట్టి మారిపోతుంటాను. ఇక చూడు నా ఆటేంటో చూపిస్తానని కనకం అంటుంది. మరోవైపు అరుణ్ వెతుక్కుంటూ కావ్య, రాజ్ వెళ్తారు. అప్పటికే అరుణ్ కి రాహుల్ ఇదంతా చెప్పి హాస్పిటల్ నుండి మానేసి వెళ్ళినట్టు స్టాఫ్ అందరికి చెప్పమంటాడు. రాజ్, కావ్య లోపలికి వెళ్ళేసరికి అరుణ్ , రాహుల్ కలిసి దాక్కుంటారు. ఇక అరుణ్ అక్కడి వెళ్ళిపోయాడని నర్స్ తో చెప్పిస్తాడు. ఇక రాజ్ కావ్య ఇద్దరు బయటకొచ్చాక.. మీ వల్లనే లేట్ అయిందని అందుకే వాడు మిస్ అయ్యాడని కావ్య అంటుంది. వాడి మీద కోపం నా మీద చూపిస్తున్నావా అని రాజ్ అంటాడు. అలా కాసేపు ఇద్దరు గొడవపడతారు. మరోవైపు అనామిక దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. ఏంటి సర్ అప్పుడే వచ్చారు. మీరింకా ఈ రోజంతా అక్కడే ఉండి మీ ఫ్రెండ్ ని ఓదారుస్తారని అనుకున్నానే అని అనామిక అనగానే.. ఇంకా కోపం తగ్గలేదా అని కళ్యాణ్ అంటాడు. మీ ఫ్రెండ్ బాధే కన్పిస్తుంది కానీ నా బాధ కన్పించట్లేదని అనామిక అనగానే.. నీ బాధేంటని కళ్యాణ్ అంటాడు. మన ఎంగేజ్ మెంట్ అయి ఇన్నిరోజులు అవుతుంది. పెళ్ళి ఎప్పుడని అందరు అడుగుతున్నారని అనామిక అనగానే.. మా వాళ్ళతో మాట్లాడి త్వరలోనే మన పెళ్లికి ముహూర్తం పెడతానని కళ్యాణ్ అనగానే.. అనామిక హ్యాపీగా ఫీల్ అయి కళ్యాణ్ కి హగ్ ఇస్తుంది.

మరోవైపు స్వప్న హాల్లో కూర్చొని తనకి ఏ ఫుడ్ కావాలో పనిమనిషికి చెప్తుంటుంది‌. అది చూసిన రుద్రాణి.. తన దగ్గరికి వెళ్ళి తిడుతుంది. నా తప్పేం లేకున్నా ప్రతీసారీ ఇలా పదిమంది ముందు అవమానిస్తే బాగోదని స్వప్న అనగానే.. ఏంటండి మనకి రోజు ఈ లొల్లి , ఆ DNA టెస్ట్ చేపించి ఈ గొడవలని ఆపండి అంటు సుభాష్ తో అపర్ణ అనగానే.. తెలిసిన డాక్టర్ ని అడిగితే ఇప్పుడు వీలు అవ్వదు ఇంకా నెల, రెండు నెలలు కావాలని చెప్పాడని సుభాష్ అంటాడు. ఇప్పుడేంటి మనం నిజం తెలుసుకోవాలంటే నెల రోజులు ఆగాలా అని అందరు అంటారు. అప్పుడే కావ్య విని.. ఏంటి ఒక అమ్మాయి శీలాన్ని ఇలా పరీక్షిస్తున్నారు. ఇంత గొప్ప కుటుంబంలో ఇంటి కోడలిని ఇలానే చూస్తారా అంటూ స్వప్నకి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.