English | Telugu

Brahmamudi: సెక్రటరీతో సంబంధం పెట్టుకున్న భర్త.. ఆ ఫోటో చూపించిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -268 లో... ఇలా అందరి ముందు ఒక ఆడపిల్లని అవమానించడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. ఆ తర్వాత DNA చేయించాలని రుద్రాణి అనగానే.. మీరు తెలిసో తెలియకో నా దారికి వచ్చారు. DNA టెస్ట్ చేయించాలి. అందులో నేను తప్పు చేసానని తెలిస్తే విడాకులు తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతానని స్వప్న అంటుంది..

ఒకవేళ నేనేం తప్పు చెయ్యలేదని రుజువు అయితే మీరేం చేస్తారని రుద్రాణిని స్వప్న అడుగుతుంది. ఆలా రుజువు అయితే నిన్ను నా కోడలిగా గౌరవంగా స్వీకరిస్తాను. నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఇంకా రాహుల్ కి శిక్ష వేస్తానని రుద్రాణి చెప్తుంది. దాంతో కావ్య కోపంగా.. ఏంటి మీ ఒప్పందాలని అడుగుతుంది. మీరు మౌనంగా ఉన్నారేంటి అమ్మమ్మ గారు‌‌.. ఒక స్త్రీకి ఇంత అవమానం జరుగుతుందని కావ్య అనగానే... స్వప్న కూడా DNA కీ రెడీ అయింది కాబట్టి మనం తన నిర్ణయాన్ని గౌరవించాలని ఇందిరాదేవి అంటుంది. DNA కి ఇంకా వన్ మంత్ టైమ్ ఉంది కదా అప్పటివరకు ఇంట్లో ఏం గొడవలు జరగకుడదని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏంటి మమ్మీ నన్ను ఇరికించావ్? ఆ కావ్య ఇందులో ఇన్వాల్వ్ అయింది. జాగ్రత్తగా ఉండాలని రుద్రాణితో రాహుల్ అనగానే.. కావ్య ప్రతి కదలిక నాకు తెలుసని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు కృష్ణమూర్తికి.. స్వప్న ప్రెగ్నెంట్ అని కనకం చెప్తుంది కానీ మొదటగా కృష్ణమూర్తి నమ్మడు కావ్య కూడా చెప్పిందని అనగానే కృష్ణమూర్తి నమ్ముతాడు. నేను వెళ్తానని కనకం అనగానే వద్దని కృష్ణమూర్తి చెప్తాడు.

మరొకవైపు స్వప్న దగ్గరకి కావ్య వచ్చి DNA అని ఎందుకు అన్నావ్? అలా చేస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్లేనని కావ్య అనగానే.. మరి ఏం చేయమంటావ్ వేరే దారి లేదు. నువ్వు రాజ్ ఎలాగైనా అరుణ్ ని పట్టుకొని నిజం చెప్పించాలని కావ్యకి స్వప్న చెప్తుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి రాహుల్ వచ్చి.. స్వప్న తప్పు చేసింది అన్నట్లు నమ్మించాలనే ప్రయత్నం చేస్తాడు. కాసేపటికి రాజ్ గదిలోకి రాగానే కావ్య డౌట్ గా మాట్లాడుతుంది. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా మీ గురించి నిజం తెలిసిపోయిందని రాజ్ తో కావ్య అంటుంది.

తరువాయి భాగంలో.. ఇంట్లో భార్యని పట్టించుకోకుండా ఆఫీస్ లో సెక్రటరీతో సంబంధం పెట్టుకున్నారా అని రాజ్ తో కావ్య అనగానే.. సాక్ష్యం ఉందా అని రాజ్ అడుగుతాడు. అప్పుడు కావ్య, రాజ్ సెక్రటరీ తో కలిసి ఉన్న ఫోటోని చూపించగా.. ఒక్క ఫొటో చూసి అమ్మాయి మీద నింద వేస్తావా అని రాజ్ అంటాడు. మీ ఇద్దరి మధ్య ఏం లేదని అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని కావ్య అనగానే.. ఏం ఉందని సాక్ష్యం చూపించాలని రాజ్ అంటాడు. మరి ఏం ఉందని మా అక్కని సాక్ష్యం చూపించమని అడుగుతున్నారని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.