English | Telugu
జగతికి ప్రశ్నించే అధికారం లేదన్న వసుధార
Updated : Jun 1, 2022
వసుధార అనే స్టూడెంట్ కి, రిషి అనే ఒక లెక్చరర్ కి మధ్య తలెత్తిన ఒక ప్రేమ కథ ఈ గుప్పెడంత మనసు. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ ని యూత్ చాలామంది ఫాలో అవుతున్నారు. వసుధార రిషి ప్రేమను రిజెక్ట్ చేసేసరికి జగతి అసలు విషయం అడుగుదామని వసుధార దగ్గరకు వస్తుంది. ఎంత అడిగినా వసుధార అసలు విషయం చెప్పదు. దీంతో జగతి ఇలా అంటుంది "నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ ఇంత తెలివైన దానివని తెలీదు. చిన్నప్పుడు కొన్ని కారణాల వలన నేను రిషిని వదిలి వెళ్లాను. ఇప్పుడు నువ్వు రిషి మనసు ముక్కలు చేసి అంతకంటే ఎక్కువ బాధను మిగిల్చావు" అంటూ బాధ పడుతుంది. ఈ విషయం నాకు రిషి సర్ కి మధ్యన జరిగింది అంటూ వసుధార సీరియస్ గా సమాధానం ఇస్తుంది. అంటే ప్రశ్నించే అధికారం నాకు లేదంటావా వసుధార అని జగతి అడుగుతుంది.
మరో పక్క రిషి, మహేంద్ర ఒకే కారులో కాలేజీకి వస్తారు. కానీ రిషి ముందు వెళ్ళిపోతాడు. మహేంద్ర పిలిచి ఇద్దరం ఒకే కారులో కదా వచ్చింది అలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతాడు. " మీరు క్లాస్ కి వస్తారా నాలా లెసన్స్ చెప్తారా " అంటూ సీరియస్ అవుతాడు. కాదు మనసులో బాధ ఉంటె చెప్పుకుంటే తగ్గుతుంది కదా అని గుటకలు వేస్తాడు మహేంద్ర. మరో పక్క కొద్దీ రోజులనుంచి డల్ గా ఉంటున్న గౌతమ్ ని విషయం ఏమిటి అని ధరణి అడుగుతుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వదిన అంటూ కామెడీ చేస్తాడు. ఇంతలో కాలేజీలోకి వస్తున్న వసుధారను పుష్ప పిలిచి ఎగ్జామ్ ఎలా రాసావ్. నువ్ రాసావంటే ఫస్ట్ రాంక్ నీదే కదా అంటుంది. రిషి బోర్డు మీద లెస్సన్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వసుధార "మే ఐ కమిన్ సర్ " అంటూ తలుపు దగ్గరనుంచి అడుగుతుంది. రిషి ఏం సమాధానం చెప్పకపోయేసరికి క్లాస్ మొత్తం గుసగుసలాడుకుంటూ ఉంటుంది. ఇది ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ అప్డేట్స్.