English | Telugu
కారణం చెప్పమని హిమని నిలదీసిన నిరుపమ్
Updated : Jun 1, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొన్ని వారాలుగా సరికొత్త మలుపులు తిరుగుతూ ఆసక్తికర ట్విస్ట్ లతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. జూన్ 1 బుధవారం తాజా ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. హిమ పెళ్లి చూపుల కోసం వచ్చిన వారిన నిరుపమ్ ఎందుకు బెదిరించాడు?.. ఈ విషయం తెలిసి సౌందర్య, ఆనందరావులు ఎలా రియాక్టయ్యారన్నది ఈ రోజు ఎపిసోడ్ లో ఆసక్తికరం. బుధవారం ఎపిసోడ్ లో హిమకు పెళ్లి ఫిక్సయిందని నిరుపమ్ తో స్వప్న చెబుతుంది. ఆ మాటలు విన్న వెంటనే నిరుపమ్ కుప్పకూలిపోతాడు.
ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేనూ చూస్తానని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. జ్వాల .. నానమ్మకు నేనే శౌర్యని అని చిన్న చిన్న క్లూలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తూ వుంటుంది. ఒక వైపు నిరుపమ్.. హిమను కలిసి వేరే వాడితో పెళ్లికి అంగీకరించడం ఏంటని మండిపడతాడు. అంతే కాకుండా ఈ పెళ్లి మన ఇద్దరికే జరుగుతుంది అంటాడు. ఈలోగా అక్కడికి జ్వాల వస్తుంది. తను రావడాన్ని గమనించిన నిరుపమ్ , హిమ టాపిక్ మార్చేస్తారు. విషయం గమనించిన జ్వాల ఏం జరుగుతోందని అడిగితే ఆ విషయం ఏంటో నేను చెబుతాను అంటాడు నిరుపమ్.. ఇదిలా వుంటే మాట మార్చిన హిమ విషయం చెప్పకుండా అక్కడి నుంచి నిరుపమ్ ని ఇంటికి పంపిస్తుంది.
ఆ తరువాత సౌందర్య .. ఆనందరావు దగ్గరికి వచ్చి నిరుపమ్ విజయవాడ సంబంధం వారికి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చాడని చెబుతుంది. ఇంత జరిగినా వాడు హిమనే ప్రేమిస్తున్నాడు అంటుంది. అయితే హిమ ప్రవర్తనకు కారణం ఏంటీ? తను ఎందుకిలా చేస్తోంది? అని సౌందర్య, ఆనందరావు ఆలోచనలో పడతారు. నిరుపమ్ కూడా ఇదే ఆలోచనతో హిమని నిలదీస్తాడు. కానీ హిమ మాత్రం అసలు విషయం బయటపెట్టదు. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.