English | Telugu
రౌడీలని కొట్టి పంపేసిన చక్రపాణి.. శైలేంద్ర ప్లాన్ ఫెయిల్!
Updated : Jan 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -971 లో.. రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం శైలేంద్ర రౌడీలని వసుధార ఇంటికి పంపించి.. అక్కడ రిషి ఉన్నాడో? లేడో చూడమని చెప్పి పంపిస్తాడు. రౌడీలు వసుధార వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తారు కానీ ఇంట్లోకి వెళ్లకుండా చక్రపాణి అడ్డుగా ఉంటాడు. ఆ తర్వాత రౌడీలని చక్రపాణి కర్రలతో కొడుతాడు. దాంతో రౌడీలు పారిపోతారు.
మరొకవైపు వసుధార ఏమైందంటు బయటకు వచ్చి చక్రపాణిని అడుగుతుంది. అతను జరిగింది మొత్తం వసుధారకి చెప్తాడు. ఆ రౌడీ ల నుండి రిషి సర్ ని ఎలాగైనా కాపాడుకోవాలని వసుధార అనగానే.. నన్ను దాటి లోపలికి ఎవరు రాలేరు. మీరు నిశ్చింతగా ఉండండి అని వసుధారకి చక్రపాణి దైర్యం చెప్పి లోపలికి పంపిస్తాడు. అ తర్వాత డోర్ బయటే చక్రపాణి ఎవరు రాకుండా కాపలాగా ఉంటాడు. మరొకవైపు రౌడీలు శైలేంద్రకి ఫోన్ చేసి అక్కడ రిషి లేడని అబద్ధం చెప్తారు. మీరు అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుందని శైలేంద్ర అనగానే లేదు నిజమే చెప్తున్నామని రౌడీలు అంటారు. మరొకవైపు ముకుల్, వసుధార కలిసి శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఎప్పటికప్పుడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడని ముకుల్ అంటాడు. నిన్న కూడా ఎటాక్ జరిగిందంటు వసుధార చెప్తుంది. రిషి సర్ ని ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదని వసుధార అంటుంది.
మరొకవైపు దేవయాని ఎన్నడు లేని విధంగా ధరణికి జ్యూస్ తీసుకొని వచ్చి మంచిగా మాట్లాడుతుంది. ఏమైంది ఇలా చేస్తుంది.. ఏదో ప్లాన్ ఉందని ధరణి అనుకుంటుంది. రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని దేవయాని అడుగుతుంది. తెలియదు అయిన తెలుసుకొని నేనేం చెయ్యలని ధరణి అంటుంది. ఆ తరువాత ధరణి వెళ్ళిపోయాక శైలేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పిందా అని అడుగుతాడు. తెలియదట ఈ మధ్య మాటలు బాగా నేర్చింది నీ భార్య అంటు శైలేంద్రతో దేవయాని చెప్తుంది. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. భద్ర వచ్చి నాకేం వర్క్ చెప్పడం లేదు.. వసుధార మేడమ్ కి సెక్యూరిటీ అన్నారు. మేడం లేదు ఇంకేం చెయ్యాలి జాబ్ మానేస్తానని భద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.