English | Telugu
పండుగ మొదలైంది.. భోగి మంటల్లో కృష్ణ ముకుంద మురారి!
Updated : Jan 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -365 లో.. సంక్రాతి పండుగ సందర్బంగా ఇంట్లో పిండి వంటలు చెయ్యడంలో కుటుంబం మొత్తం బిజీగా ఉంటుంది. శకుంతల అరిసెలు చేస్తుంటే ముకుంద పిండి కలుపుతుంటుంది. మధు వీడియో షూట్ చేసే పనిలో ఉంటాడు. నన్ను నా తప్పుని క్షమించి నాతో కలిసి మెలిసి ఉంటున్నారని ముకుంద అంటుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. కృష్ణ స్వెటర్ లో రావడం చూసి ఏంటి అలా వస్తున్నారని నందు అడుగుతుంది. తనకి స్వెటర్ కావాలని అడిగింది. అది కూడా ఇలా లూస్ ఉంటేనే ఇష్టమట అనగానే అందరు నవ్వుతారు. మీరు నవ్వుకున్నా ఏం చేసిన నాకు ఇలాగే ఇష్టమని కృష్ణ అంటుంది. అయిన మీకు పెళ్లి అయింది. ఇప్పుడు స్వెటర్ ఎందుకని ముకుంద అనగానే.. కృష్ణ, మురారి సిగ్గు పడుతారు. ఆ తర్వాత పంతులు గారికి ఫోన్ చేశాను. పండుగ అయ్యేంత వరకు మంచి రోజులు లెవ్వట అని మురారికి రేవతి చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు కలిసి సరదాగా ఒక గేమ్ అడుతారు. మురారి వీపుపై దువ్వెనతో కృష్ణ ఒక నేమ్ రాస్తుంది దానిని మురారి గెస్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరొకవైపు పిండి వంటలు పూర్తి చేస్తారు. ముకుంద మారిపోయి మనతో మంచిగా ఉంటుంది కానీ మధుకి ముకుంద నటిస్తుందని అంటున్నాడు అని శకుంతల అనగానే.. నాక్కూడా ముకుంద మారింది అనిపిస్తుందని రేవతి నందు ఇద్దరు అంటారు కానీ మధు మాత్రం ఇంకా డౌట్ గానే ఉంటాడు.
మరొకవైపు గౌతమ్ ఇంటికి వస్తాడు. అ తర్వాత భోగి మంటల కోసం ఇంట్లో పనికి రానివాటిని తీసుకొని రమ్మని భవాని అనగానే అందరు తమ గదుల్లో ఉన్న వెస్ట్ సామాన్లని తీసుకొని వస్తారు. అ తర్వాత కృష్ణ ఇనుప వస్తువు తీసుకొని వస్తే అందరు నవ్వుతారు. ఈ వేస్ట్ సామాను వేరేవాళ్ళకి ఉపయోగపడుతాయ్.. భోగి మంటలకు వేరే ఏర్పాటు చేశానని భవాని చెప్తుంది. మరొక వైపు శకుంతల భోగి మంటలకు ఏర్పాటు చేస్తు.. భవాని వదిన నాతో మాట్లాడిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అ తర్వాత అందరు భోగి మంటల దగ్గరికి వస్తారు. ముకుంద ఒక్కర్తే ఇంట్లో ఉంటుంది. పాపం ముకుంద ఒక్కర్తే ఉంది. ఫీల్ అవుతుంది.. తీసుకొని రావాలా అని భవానిని కృష్ణ అడుగుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే