English | Telugu
వసంత కోకిల సీరియల్ లో గుప్పెడంత మనసు మను!
Updated : Jun 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే కొన్ని రోజుల క్రితం వరకు రిషి కోసం ఎదురుచూసిన ఈ సీరియల్ అభిమానులకి రిషి ఎంట్రీతో ఊరట లభించింది. అయితే రిషి లేనప్పుడు కథను ముందుకు నడిపించడానికి మను అనే కొత్త క్యారెక్టర్‌ని తీసుకొచ్చారు మేకర్స్. ఈ పాత్రలో రవిశంకర్ రాథోడ్ అద్భుతంగా నటించాడు. అయితే రిషి లేకపోడంతో చాలామంది గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఆ సీరియల్‌ని చూడ్డం మానేయడంతో పాటు.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సెకండ్ హీరో మనుని కూడా తిట్టేశారు.
ఇప్పుడు రిషి రీఎంట్రీ ఇచ్చేయడంతో మనుని సీరియల్‌లో ఉంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా.. రిషి ఉండగా మను సెకండ్ హీరో అవుతాడు తప్పితే.. మెయిన్ లీడ్ కాలేడు. పైగా రిషిని ఆదరించినట్టుగా మనుని ఆదరిస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గుప్పెడంత మనసులో ఎంత మంది ఉన్నా కూడా రిషికి ఉన్న ప్రాధాన్యతే వేరు. దాదాపు ఆరేడు నెలల తరువాత రిషి రీఎంట్రీ ఇచ్చినా.. అతని కోసమే సీరియల్ చూస్తున్నారంటే, అతని కోసమే వేచి చూశారంటే, రిషి పాత్ర ఏ రేంజ్‌లో ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు మను తన తండ్రి కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. మహేంద్రే తన తండ్రి అనే విషయం ఒక్క మనుకి తప్ప అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికి తెలుసు. ఇక రంగాగా ఎంట్రీ ఇచ్చాడు రిషి. కానీ అతను తిరిగి రిషిగా మారడం అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు.
రవి శంకర్ రాథోడ్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కొత్త సీరియల్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈటీవీలో ‘వసంత కోకిల’ అనే సీరియల్‌లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు రవి శంకర్ రాథోడ్. మధుబాబు, రవి శంకర్ రాథోడ్, లక్ష్యా శెట్టిలు మెయిన్ లీడ్‌గా ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రవి శంకర్ షేర్ చేయడంతో.. ఇక అతను గుప్పెడంత మనసుకి గుడ్ బై చెప్పేస్తున్నట్టే లెక్క అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. అయితే ఏకకాలంలో నాలుగైదు సీరియల్స్ చేస్తున్నవాళ్లు ఉన్నారు.. అలాంటిది రవి శంకర్.. అటు గుప్పెడంత మనసుని.. ఇటు వసంత కోకిల సీరియల్‌ని బ్యాలెన్స్ చేయలేడా? అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరి గుప్పెడంత మనసులో మను పాత్రను కంటిన్యూ చేస్తారో.. లేదంటే అవసరం అయిపోయింది కాబట్టి.. తీసి పక్కనపెడతారో చూడాలి మరి.