English | Telugu

Eto Vellipoyindhi Manasu : అభి నాటకం రామలక్ష్మికి తెలిసేనా.. మాణిక్యం కొత్త ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రామలక్ష్మి నిద్ర నుండి లేచి.. సర్ నాకు ఏదో గిల్టీ గా ఉంది తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఇలా నాటకం ఆడడం నాకు బాధగా ఉంది. అభి ఫారెన్ వెళ్లగానే నన్ను కూడా త్వరగా పంపించండి అని సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. సరే అభి అక్కడకు వెళ్లి సెటిల్ అయిన వెంటనే నిన్ను పంపిస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. అభిని ఫారెన్ ఎప్పుడు వెళ్తున్నావని అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు వెళ్తానని అన్నాడు. అంటే తన మాటలో అర్థం ఏమిటని సీతాకాంత్ అనుకుంటాడు.

మరొకవైపు అభి తన ఫ్రెండ్ తో ప్రొద్దునే డ్రింక్ చేస్తు ఉంటాడు. నేను రామలక్ష్మిని ఇష్టపడడానికి కారణం తన అందం తెలివి. తనకి ఉన్న తెలివితో ఫస్ట్ అటెంప్ట్ లోనే IAS అవుతుంది. అందుకే నేను కష్టపడకుండా తన భర్త పేరు తెచ్చుకోవచ్చని, సెటిల్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు.. కష్టపడకుండా దర్జాగా బ్రతకోచ్చని తన ఫ్రెండ్ కి అభి చెప్తాడు. కానీ సీతాకాంత్ సర్ రూపంలో అదృష్టం ముందే వచ్చింది.. రామలక్ష్మి తనకి భార్యగా నటిస్తున్నందుకు.. నాకు డబ్బులు ఇస్తున్నాడు.. ఇంకా సర్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటానని తన ఫ్రెండ్ కి అభి చెప్తాడు. మరొకవైపు సీతాకాంత్ తనని మోసం చేసి.. సిరి, ధనలకి పెళ్లి చేసాడనే విషయాన్ని మాణిక్యం గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే సుజాత వచ్చి.. సరుకులు తీసుకొని రండి అని మాణిక్యంతో చెప్తుంది. మనకు ఇలా తెచ్చుకునే కర్మ ఎందుకు? మనం కూడా మన అల్లుడు ఇంట్లో ఉందామని మాణిక్యం అంటాడు. అలా ఎవరైనా ఉంటారా అని సుజాత అంటుంది. అయిన తన మాటలు వినకుండా సీతాకాంత్ ఇంటికి బయలుదేర్తాడు మాణిక్యం . ఆ తర్వాత సీతాకాంత్ తన చెల్లి సిరి, ధనలకి హనీమూన్ టికెట్ తీసుకొని వస్తాడు. హనీమూన్ కి వెళ్ళాల్సింది వాళ్ళిద్దరు కాదు.. నువ్వు రామలక్ష్మి కదా అని శ్రీలత అంటుంది. దాంతో సీతాకాంత్ టెన్షన్ పడుతు.. నాకు ఆఫీస్ లో చాలా వర్క్ ఉందని చెప్తాడు.

ఆ తర్వాత శ్రీలత ఎంత చెప్పిన వినకుండా.. నాకు ఆఫీస్ లో వర్క్ ఉందని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోలేదు.. లేదంటే హనీమూన్ కి వెళ్ళేవాళ్ళు కదా అని శ్రీలత , శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ దగ్గరికి మాణిక్యం వచ్చి.. మేమ్ ఇక్కడే ఉంటామని అంటాడు. దాంతో రామలక్ష్మి విని.. ఇలా ఉండడం కరెక్ట్ కాదని తిడుతుంది. ఏదైనా జాబ్ చెయ్ అని మాణిక్యంతో రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ విజిటింగ్ కార్డు ఇచ్చి.. అక్కడికి వెళ్లి జాబ్ లో జాయిన్ అవ్వమని‌ మాణిక్యంతో సీతాకాంత్ చెప్పగానే మాణిక్యం డిసప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.