English | Telugu

Brahmamudi : కళ్యాణ్ కోసం రాహుల్ ప్లాన్.. ఆమె వెన్నెల అని కావ్య కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -384 లో.. దేవుడికి కావ్య తన బాధని చెప్పుకుంటూ ఉంటే ఇందిరాదేవి వస్తుంది. వెన్నెలని కలుస్తున్నానంటూ ఇందిరాదేవికి కావ్య చెప్పగా.. అసలు నా వల్లే ఇదంతా అని ఇందిరాదేవి బాధపడుతుంది. మరొకవైపు ఇప్పుడు నీచేత ఒక తప్పు చేయించబోతున్నాను రా కళ్యాణ్ అని రాహుల్ అనుకుంటాడు.

అ తర్వాత రాహుల్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. నువ్వు ఫారెన్ నుండి దొంగతనంగా తీసుకొని వచ్చిన టెన్ కేజీస్ బంగారం తీసుకొని మా కంపెనీకి రా అని చెప్తాడు. అది ఆఫీషియల్ గా మా కంపెనీ కొనేలా నేను ప్లాన్ చేస్తానని రాహుల్ అంటాడు. ఏదైన ప్రాబ్లమ్ అయితే అని అతను అడుగగా.. దానికి ఇక్కడ ఒక బకరాగాడు ఉన్నాడులేరా అని రాహుల్ అంటాడు. అందులో ట్వంటీ పర్సెంట్ కావాలని రాహుల్ అంటాడు. ఇక ఆ తర్వాత.. ఒరేయ్ కళ్యాణ్ దీంతో నువ్వు జైలుకు నేను ఎండీ చైర్ లోకి అని రాహుల్ అనుకుంటాడు. తర్వాత దానికి సంబంధించిన ఫైల్ ని కళ్యాణ్ కి చూపిస్తాడు. మరొకవైపు రీయూనియన్ పేరిట ఓల్డ్ స్టూడెంట్స్ అందరు పార్టీలో కలుస్తారు. అ తర్వాత అక్కడికి కావ్య, రాజ్ కూడా వస్తారు. అందరు కాసేపు మాట్లాడుకుంటారు. కావ్య, శ్వేత ఇద్దరు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. ఇదంతా ప్లాన్ చేసింది వెన్నెల కోసం.. అసలు తను వస్తుందా అని కావ్య అడుగగా.. వస్తుందని శ్వేత చెప్తుంది. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమని శ్వేతతో కావ్య అంటుంది. కాసేపటికి వెన్నెలకి శ్వేత ఫోన్ చేస్తుంది. వస్తున్నానని వెన్నెల చెప్తుంది. తను వస్తే ఒక పరిష్కారం దొరుకుతుందని కావ్య అనుకుంటుంది. అ తర్వాత కనకం పక్కింటావిడ అప్పుకి రెండవ పెళ్లి సంబంధం తీసుకొని వస్తుంది. దాంతో తనని కనకం, అప్పు ఇద్దరు తిట్టి పంపిస్తారు.

మరొకవైపు రీయూనియన్ పార్టీలో అందరు సరదాగా కబుర్లు చెప్పుకుంటు ఉంటారు. ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటారు. రాజ్ వంతు కాగా నీ భార్య మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలని శ్వేత అనగానే.. కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తుంటే కావ్య కూడా ఇంప్రెస్ అవుతుంది. తరువాయి భాగంలో శ్వేత ద్వారా వెన్నెల పార్టీకీ వస్తున్న విషయం రాజ్ కి తెలుస్తుంది. దాంతో రాజ్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు వెన్నెల వస్తే అంతా తెలిసిపోతుందనని రాజ్ టెన్షన్ పడతాడు. ఏ వెన్నెల.. నాకు తెలిసిన వెన్నెలనేనా అని కావ్య అంటుంది. అప్పుడే వెన్నెల కార్ లో నుండి దిగుతుంది. రాజ్ తనని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.