English | Telugu

రైతులకే ప్రైజ్ మనీ ఇస్తానన్న పల్లవి ప్రశాంత్!


బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతూ జనాల ఆదరణ పొందుతుంది. గతవారం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో గౌతమ్ ఎలిమినేట్ అయి ఇప్పుడు టాప్-7 మిగిలారు. వీరిలో ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కోరకమైన ఆటతీరుతో, మాటతీరుతో స్ట్రాటజీలతో ఉంటు వస్తున్నారు.

గతవారం టికెట్ టు ఫినాలే కోసం జరిగిన టాస్క్ లలో అంబటి అర్జున్ గెలిచి ఫైనల్ కి చేరుకున్నాడు. ఇక పద్నాలుగవ వారం నామినేషన్ లో లేకుండా సేవ్ అయ్యాడు. ‌అయితే వీకెండ్ లో వచ్చిన నాగార్జున ప్రైజ్ మనీని కంటెస్టెంట్స్ చెప్పాడు. ఈ సీజన్-7 విజేతకి 50 లక్షల డబ్బుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన జోయాలుకాస్ డైమండ్ నెక్లెస్ లభిస్తుందని నాగార్జున తెలిపాడు. ఇక ఈ వివరాలు చెప్పిన నాగార్జున.. మీరు 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని ఒక్కో‌ కంటెస్టెంట్ ని అడిగాడు ‌నాగార్జున. మా మేనకోడలికి మంచి లైఫ్ ఇస్తాను‌. కొన్ని లోన్లు ఉన్నాయని ఈ డబ్బులతో అవన్నీ చేస్తానని అంబటి అర్జున్ అన్నాడు. మా అమ్మనాన్నలకి ఇప్పటివరకు సొంతంగా ఏమీ లేదని, ఈ డబ్బులు గెలిస్తే సొంత ఇల్లు కొనిస్తానని ప్రియాంక అంది. అనంతపూర్ లో కాకుండా హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనిస్తానని అమర్ దీప్ అన్నాడు.

ఇక యావర్ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యాడు. మా అన్నయ్య మాకోసం చాలా కష్టపడుతున్నాడు. అసలు ఎలా బతుకుతున్నామో అర్థం కావట్లేదు. లోన్లు, EMI లు ఉన్నాయని, ఈ డబ్బులు కూడా సరిపోవు కానీ ఇవి హెల్ప్ అవుతాయని యావర్ అన్నాడు. ఆ తర్వాత శివాజీ వచ్చి.. అసలు ఇక్కడివరకు వస్తానని ఊహించలేదు. ఈ యాభై లక్షలు గెలిచాక ఏం చేస్తానో చెప్తానని, ఇది అందరికి రావాలని కోరుకుంటున్నానని శివాజీ అన్నాడు. ఇక ప్రశాంత్ వచ్చేసి.. రైతులకి ఇస్తాను సర్ అని అన్నాడు. ఎందుకని నాగార్జున అనగా.. ప్రతీ సంవత్సరం రైతులు పండించిన పంటకి సరైన ధర రావట్లేదు. అప్పులు పెరుగుతున్నాయి. ఇక పంట చేతికి వచ్చేసరికి ఏదో సమస్య వల్ల నాశనం అవుతున్నాయని, అలా చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అలాంటివారికి ఈ డబ్బులని ఇచ్చి సాయంగా ఉంటానని ప్రశాంత్ అన్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 టోటల్ ఎపిసోడ్ లోనే హైలైట్ గా నిలిచింది. ఒక రైతిబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. రైతల వెంటే ఉంటానంటూ చెప్పడంతో గూస్ బంప్స్ వచ్చాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.