English | Telugu
గ్రాండ్ ఫినాలే టీఆర్పీ ఇంతొచ్చిందా?
Updated : Dec 31, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. గత సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్ సప్పగా సాగిందని విమర్శలు వినిపించాయి. అయితే ఫైనల్ గా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేలో సన్నీ విజేతగా నిలిచి దాదాపు కోటి రూపాయల ప్రై సన్నీదక్కించుకున్నాడు. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు 25 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. 15 వారాల రెమ్యునరేషన్ వెరసి వీజే సన్నీకి కోటికి మించి అందినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సీజన్‌కి సంబంధించిన తాజగా మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో గ్రాండ్ ఫినాలే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. సీజన్ 5 గ్రాండ్ ఫినాలే గత సీజన్ లకు పూర్తి భిన్నంగా సాగింది. గ్రాండ్ ఫినాలే రోజు హౌస్ లో మొత్తం ఐదుగురు సభ్యులున్నారు. సన్నీ, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి. ఈ ఐదుగురిలో సిరి ఎలిమినేట్ కావడం తెలిసిందే. ఆ తరువాత మానస్, శ్రీరామ్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరికి సన్నీ, షణ్ముఖ్ ఇద్దరు మాత్రమే ఫైనల్ కు చేరుకున్నారు.
ఫైనల్ గా వీజే సన్నీ విజేతగా నిలిచాడు. అయితే ఆరోజు జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి ప్రధానంగా ఛీఫ్ గెస్ట్ అంటూ ఎవరూ హాజరు కాకపోయినా షోకు భారీ స్థాయిలో టీఆర్పీరేటింగ్ రావడం గమనార్హం. ఈ షోలో అతిథులుగా రాజమౌళి, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అలియా భట్ పాల్గొని సందడి చేశారు. నాగచైతన్య, నాని, సాయి పల్లవి, కృతిశెట్టి తో పాటు హౌస్‌లోకి రాగా.. మరి కొంత మంది తమ డ్యాన్సులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ షో టాప్ హిట్ గా నిలిచింది. టీఆర్పీ రేటింగ్ 18.4గా నమోదైందని, ఈ షో గ్రాండ్ ఫినాలేని 6.2 కోట్ల మంది వీక్షించారని, 4. 5 గంటల పాటు షో సాగిందని `స్టార్ మా` సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.